Horoscope Today: ఆ రాశి వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (September 11, 2025): మేష రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఈ రోజు ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో గానీ పనులు, వ్యవహారాలు పూర్తి కావు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (సెప్టెంబర్ 11, 2025): మేష రాశి వారి ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా నడుస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో గానీ పనులు, వ్యవహారాలు పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో హుషారు పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు, ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగి పోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగి పోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీదా, కుటుంబ వ్యవహారాల మీదా శ్రద్ధ పెట్టడం అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మారడానికి చేస్తున్న ఫలితాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అన్ని రంగాలవారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి ప్రశంసలందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలకు లేదా విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.



