AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరికి ఊహించని ధనలాభం.. పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఎలా ఉందంటే.?

ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆ వివరాలు..

Horoscope Today: వీరికి ఊహించని ధనలాభం.. పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఎలా ఉందంటే.?
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 03, 2025 | 7:06 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలను అందుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అనుకున్న పనులు వేగంగా పూర్తవు తాయి. తోబుట్టువులతో వివాదాల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధువులతో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగి స్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండకపోవచ్చు. ఆదాయపరంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఫలితం ఉంటుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండా ల్సిన అవసరం ఉంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి తప్పకపోవచ్చు. భారీ లక్ష్యాలు అప్పగించడం వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, తదితర వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. తీరిక లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అను కోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభి స్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోప వాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆదాయానికి లోటుం డదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలలో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి కొన్ని కొత్త ప్రయత్నాలను చేపడతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందుతుంది. అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఆశించిన ఉపశ మనం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం