AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: వృథా ఖర్చుల పట్ల ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 25, 2025): మేష రాశి వారికి రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: వృథా ఖర్చుల పట్ల ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 25 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 25, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలను, భారీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిపాటి ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో శ్రమ, తిప్పట ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభ వార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లల చదువులు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు సాధారణ సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొద్దిపాటి ధన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. విశ్రాంతి కరువవుతుంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయట పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులతో పాటు కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మధ్యవర్తుల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇతరులకు సాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరగడంతో పాటు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు బాగాబిజీగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపో తుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గురు బలం అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారాలు తమకు అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

Follow Us