Rashi Phalalu: ఆ రాశుల వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (November 03, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. వృషభ రాశి వారి పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (నవంబర్ 3, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధికంగా ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో బాగా ఖర్చవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతల్లో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సఖ్యత బాగా పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సహచరుల బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలకు బాగా దూరంగా ఉండడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహం కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు సంతృప్తి కరంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో సొంత నిర్ణయాలు మంచివి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. కుటుంబంలోశుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోక పోవడం, వాదనలకు దిగకపోవడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపడతారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. కొంత వ్యయ ప్రయాసలకు అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఆస్తి వివాదంలో సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆస్తి వివాదంలో ఒక సానుకూల సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవు తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.



