మే 17 రాశిఫలాలు: ఏ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందంటే? వారు జాగ్రత్త..!
మే 17, 2026 ఆదివారం రాశిఫలాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉండగా, వృషభ రాశి వారికి ఉద్యోగ భద్రత పెరుగుతుంది. మిథున రాశి వారు పనిభారం ఎక్కువైనా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

దిన ఫలాలు (మే 17, 2026): మేష రాశి వారికి ఈ రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మార్పులు చేపట్టి లబ్ధి పొందు తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులకు అండగా నిలబడతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేపడతారు. సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో మధ్య మధ్య చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు అంది వస్తాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, కింది ఉద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కాస్తంత జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగుతుంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లి తండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సొంత పనులు పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు లాభిస్తాయి. అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ ఖర్చులు పెరగడం, తరచూ స్వల్ప అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త ఆఫర్లు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఖర్చుల్ని అదుపు చేసి, పొదుపు పాటిస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు. పెద్దల సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఖర్చు చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.