AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారందరికీ శుభ ఘడియలు.. మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాల ఆధారంగానే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టేవారు లేదా పనులను వాయిదా వేసుకునే వారు కూడా ఉంటారు.

Horoscope Today: వారందరికీ శుభ ఘడియలు.. మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today
Shaik Madar Saheb
|

Updated on: Nov 15, 2022 | 5:29 AM

Share

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాల ఆధారంగానే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టేవారు లేదా పనులను వాయిదా వేసుకునే వారు కూడా ఉంటారు. మరి ఈరోజు (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  1. మేషం: ఈ రాశివారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే.. విజయం దరిచేరే అవకాశముంది. కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశివారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసరవిషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.
  3. మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
  4. కర్కాటకం: ఈ రాశివారికి శుభ కాలం.. చేపట్టిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. జాగ్రత్తగా ముందుకు సాగాలి. ముఖ్యంగా మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం అవుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
  7. కన్య: శారీరక శ్రమ పెరిగినప్పటికీ.. చేపట్టిన పనులు స్నేహితుల సహకారంతో పూర్తవుతాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
  8. తుల: ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యులు, బంధుమిత్రలతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  9. వృశ్చికం: ఈ రాశివారు ఒక శుభవార్త ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్త ఉండటం మంచిది. కీలక విషయాలను వారితో చర్చించకపోవడం మంచిది. ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తే విజయం వరిస్తుంది.
  10. ధనుస్సు: ఈ రాశివారికి ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శ్రమ పెరిగినా.. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
  11. మకరం: ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి.
  12. కుంభం: అభివృద్దికి సంబంధించి ఈ రాశి వారు శుభవార్త వింటారు. బంధుమిత్రుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  13. మీనం: ఈ రాశివారు చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.. అయినా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక విషయాల్లో తోటివారి నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..