Horoscope Today: వీరికి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు.. కొత్త వస్తువులు కొంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (08-07-2022): ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు జరపాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా అనుకూల సమయం చూసుకుంటారు చాలామంది. అందుకే రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి
Horoscope Today (08-07-2022): ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు జరపాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా అనుకూల సమయం చూసుకుంటారు చాలామంది. అందుకే రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆరాతీస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు మరీ చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు.మరి జులై 8 (శుక్రవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
ఉద్యోగంలో ప్రశంసలు అందుతాయి. బంధువులు, కుటుంబీకుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లలితాదేవిని స్తుతిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
వృషభం
కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అస్థిర ఆలోచలనలను దూరం చేయాలి. శుభం కోసం గోసేవ చేయాలి.
మిథునం
కొన్ని విషయాల్లో అస్థిర ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక వ్యవహరాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిది.
కర్కాటకం
వీరు మానసికంగా దృఢంగా ఉంటారు. సంకల్పబలంతో ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధనతో శుభం కలుగుతుంది.
సింహం
ఈరాశివారు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
కన్య
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో కొందరి వ్యక్తుల ప్రవర్తన మనసును ఇబ్బంది పెడుతుంది. ఆదిత్యహృదయం చదివితే మంచిది.
తుల
వీరు సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకపోవడం ఉత్తమం. ప్రయాణాల్లో ఆటంకాలు తప్పవు. అనవసర ఖర్చులుంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
వృశ్చికం
వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది. శ్రమను నమ్ముకున్నప్పుడే సానుకూల ఫలితాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. చంద్ర ధ్యానం శుభప్రదం.
ధనస్సు
ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే శుభం కలుగుతుంది.
మకరం
చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబీకుల సహకారం అందుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
కుంభం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. కీలక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం జపిస్తే శుభం కలుగుతుంది.
మీనం
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్థిరంగా వ్యవహరించాలి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దుర్గా అష్టోత్తరం పఠిస్తే మంచిది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..