AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Puja Tips: శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోకండి..లక్ష్మి దేవి ఆగ్రహంతో డబ్బులు నష్టపోతారు

వారంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీదేవితో పాటు శుక్రుడుని కూడా పూజిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేసి పూజిస్తారు. ఈ రోజున మహిళలు ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు దానం, అన్నదానం చేస్తారు. హిందూ మతం ప్రకారం లక్ష్మి సంపదకు దేవత. కనుక శుభం కలగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయాలనే నియమం ఉంది. ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలనే నియమం ఉంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనడం లేదా తీసుకురావడం నిషేధం.

Friday Puja Tips: శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోకండి..లక్ష్మి దేవి ఆగ్రహంతో డబ్బులు నష్టపోతారు
Friday Puja Tips
Surya Kala
|

Updated on: Sep 13, 2024 | 6:40 AM

Share

హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క దేవీదేవతలకు అంకితం చేయబడింది. ఈ నేపధ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చేసే చర్యలు లక్ష్మీ దేవి ఆశీర్వాదం జీవితాంతం కురుస్తుందని నమ్మకం. అంతేకాదు శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహం కలిగితే భక్తులు దారిద్య్రానికి గురవుతారు. లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ధనవంతుల నుంచి పేదవారిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని రకాల వస్తువులను కొనకండి లేదా ఇంట్లోకి తీసుకురాకండి.

  1. శుక్రవారం రోజున ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం రాకూడదు అని అనుకుంటే శుక్రవారం పొరపాటున కొన్ని రకాల వస్తువులను కొనుగోలుచేయకూడదు.
  2. శుక్రవారం రోజున పొరపాటున వంటగది వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇది జీవితంలో వివిధ సమస్యలను, ఇబ్బందులను పెంచుతుంది.
  3. జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం పొరపాటున ఎలాంటి ఆస్తి లావాదేవీలు చేయకండి. వీటన్నింటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే కుటుంబం దాని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది.
  4. శుక్రవారం పొరపాటున ఎవరికీ స్వీట్లు ఇవ్వకండి. అప్పుడు శుక్రుడు బలహీనంగా మారవచ్చు. ఇంటి శాంతికి కూడా భంగం కలుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. శుక్రవారం పొరపాటున కూడా డబ్బులను ఇచ్చి పుచ్చుకోవడం చేయవద్దు. డబ్బుల విషయంలో ఈ చర్యను చేయడం వలన లక్ష్మీదేవికి కూడా కోపం రావచ్చు.
  7. పొరపాటున కూడా ఇంటిని మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉంచవద్దు. పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంటి పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
  8. చిరిగిన లేదా మురికి బట్టలు ధరిస్తే నవ గ్రహాలలో ఛాయా గ్రహం రాహువుకి ఆగ్రహం కలుగుతుంది. రాహువు అటువంటి వ్యక్తీ ఆరోగ్యానికి హానిని చేయవచ్చు. కనుక శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించండి. లక్ష్మిదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి