చంద్ర గ్రహణంతో ఈ రాశుల వారు కాస్త జాగ్రత్త.. చేయాల్సిన పరిహారాలు ఇవే..
ఈ నెల 17న మీన రాశిలో చోటు చేసుకుంటున్న చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మీనంలో చంద్ర రాహువులు, దానికి సప్తమ స్థానంలో రవి కేతువులు కలవడంవల్ల ఈ గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు మానసికంగా అలజడి చెందడం, ఆందోళన చెందడం, సమస్యలను ఊహించుకుని భయపడడం కాస్తంత ఎక్కువగా ఉంటుంది.
ఈ నెల 17న మీన రాశిలో చోటు చేసుకుంటున్న చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మీనంలో చంద్ర రాహువులు, దానికి సప్తమ స్థానంలో రవి కేతువులు కలవడంవల్ల ఈ గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు మానసికంగా అలజడి చెందడం, ఆందోళన చెందడం, సమస్యలను ఊహించుకుని భయపడడం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు ఒక పట్టాన ముందుకు సాగకపోవడం, ప్రయత్నాలు ఫలించకపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఈ గ్రహణ ప్రభావం పదిహేను రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశుల వారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.
- మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కష్టార్జితం ఎక్కువగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన ముందుకు సాగదు. విదేశాల్లో ఉన్న పిల్లలు లేదా బంధువుల నుంచి దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. నమ్మినవారు మోసగించడం, ధన నష్టం జరగడం వంటివి అనుభవానికి వస్తాయి. మనసంతా కొద్దిగా అలజడిగా, ఆందోళనగా ఉండే సూచనలున్నాయి. ఈ రాశివారు ఇష్టమైన ఆలయాలను ఎక్కువ పర్యాయాలు దర్శించడం మంచిది.
- సింహం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో చంద్ర రాహువులు కలుస్తున్నందువల్ల మానసిక పరిస్థితి అస్త వ్యస్తంగా ఉంటుంది. అకారణ వైరాలు, వైషమ్యాలతో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ముఖ్యమైన పనులు సైతం ముందుకు కదలవు. బంధుమిత్రుల నుంచి విమ ర్శలు, నిందలు ఎదురవుతాయి. అధికారులు మీ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. దుర్గాదేవి స్తోత్ర పఠనం మంచిది.
- కన్య: ఈ రాశిలోని రవి కేతువులతో చంద్ర రాహువులకు సమ సప్తకం ఏర్పడి గ్రహణం కలుగుతు న్నందు వల్ల, అనారోగ్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి తీసుకు వస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా మందగిస్తాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. పది రోజుల పాటు ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందు వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. సహాయం పొందినవారు ముఖం చాటేసే అవ కాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. గృహ, వాహన సౌకర్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. చిన్నపాటి అన్నదానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది కలిగి స్తాయి. ధన సంబంధమైన ఏ ప్రయత్నమైనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధి అవ కాశాలు వెనుకపట్టు పడతాయి. నమ్మక ద్రోహం వల్ల గానీ, మోసం వల్ల గానీ బాగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులకు, ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం తగ్గుతుంది. రోజూ గణపతిని స్తుతించడం మంచిది.
- మీనం: ఈ రాశిలో చంద్ర గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల వాహన ప్రమాదాలు సంభవించే సూచ నలున్నాయి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు. మాటకు విలువ తగ్గుతుంది. కుటుంబ ఖర్చులు పెరగడంతో పాటు కుటుంబ వ్యవహారాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తాయి. చేయాల్సిన పనులు చేయలేని పరిస్థితులు తలెత్తు తాయి. మానసిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సుందరకాండ పారాయణ వల్ల శుభం జరుగుతుంది.