Chandra Grahan 2024: వచ్చే చంద్ర గ్రహణంతో వారికి ప్రత్యేక యోగాలు.. జీవితాలు సరికొత్త మలుపు
ఈ నెల 17 ఏర్పడనున్న చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి జీవితాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. మీన రాశిలో చంద్ర రాహువులు, దానికి సప్తమ స్థానమైన కన్యారాశిలో రవి కేతులు కలవడం వల్ల చంద్ర గ్రహణం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహణం దుస్థానాల్లో చోటు చేసుకున్నప్పుడు మాత్రమే దుష్ఫలితాలు అనుభవానికి వస్తాయి.
ఈ నెల 17 ఏర్పడనున్న చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి జీవితాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. మీన రాశిలో చంద్ర రాహువులు, దానికి సప్తమ స్థానమైన కన్యారాశిలో రవి కేతులు కలవడం వల్ల చంద్ర గ్రహణం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహణం దుస్థానాల్లో చోటు చేసుకున్నప్పుడు మాత్రమే దుష్ఫలితాలు అనుభవానికి వస్తాయి. అయితే, కొన్ని రాశుల వారికి ఇది తప్పకుండా శుభ ఫలితాలను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ చంద్ర గ్రహణం తప్పకుండా శుభ యోగాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గ్రహణ ప్రభావం దాదాపు పదిహేను రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఏ ఆదాయ ప్రయత్నమైనా అంచనాలకు మించిన ఫలితమిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. శత్రువులు కూడా మిత్రు లుగా మారి సహకరించడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా ఊహించని అదృష్టాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించడానికి, జీతభత్యాలు భారీగా పెరగడానికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఉద్యోగావకాశాలు వృద్ది చెందడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతి ష్ఠలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర రాహులు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలు మెరుగు పడతాయి. ఉద్యోగాల కోసం, ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి విదేశీ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయం కావచ్చు. ప్రేమ వ్యవహా రాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో చేరడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల తప్పకుండా ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ రాశివారి సంపద బాగా పెరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యల నుంచి బయ టపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందివస్తాయి. వ్యాపారులు, వృత్తి నిపు ణులు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారిపోవడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో సంభవిస్తున్న గ్రహణం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పదోన్నతులు లభించడం గానీ, జీత భత్యాలు పెరగడం కానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విద్యా ర్థులు ఘన విజయాలు సాధిస్తారు. చదువుల రీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి, తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో కొన్ని ముఖ్యమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. డాక్టర్లు,లాయర్లు తదితర వృత్తుల వారు విజయాలు సాధిస్తారు.