Thursday Puja Tips: జాతకంలో గురు దోషమా!.. శ్రీ హరి ప్రసన్నం కోసం గురువారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

హిందూ విశ్వాసం ప్రకారం ఉద్యోగం లేదా జీవనోపాధికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, దానిని అధిగమించడానికి బృహస్పతి మాత్రమే సహాయంచేస్తాడు. అలాగే విష్ణువు ఆశీర్వాదంతో ఎవరైనా అన్ని రకాల కష్టాల నుండి బయటపడతారు. అదృష్ట సాంగత్యాన్ని పొందడం ప్రారంభిస్తారు. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. గురువారం రోజున పొరపాటున కూడా ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి

Thursday Puja Tips: జాతకంలో గురు దోషమా!.. శ్రీ హరి ప్రసన్నం కోసం గురువారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Thursday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2024 | 7:16 AM

హిందూ సనాతన ధర్మంలో మత విశ్వాసాల ప్రకారం గురువారం విష్ణువుకి అంకితం చేయబడింది. ఈ రోజున దేవ గురువు బృహస్పతిని కూడా పుజిస్తారు. గురు వారం నియమ నిష్టలతో పూజించడం ద్వారా విష్ణువును అలాగే దేవ గురువు గురువుని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. హిందూ విశ్వాసం ప్రకారం ఉద్యోగం లేదా జీవనోపాధికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, దానిని అధిగమించడానికి బృహస్పతి మాత్రమే సహాయంచేస్తాడు. అలాగే విష్ణువు ఆశీర్వాదంతో ఎవరైనా అన్ని రకాల కష్టాల నుండి బయటపడతారు. అదృష్ట సాంగత్యాన్ని పొందడం ప్రారంభిస్తారు. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. గురువారం రోజున పొరపాటున కూడా ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విష్ణువు అనుగ్రహం పొందాలంటే గురువారం పొరపాటున ఈ పనులు చేయకండి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

అరటిపండ్లు తినవద్దు

మత విశ్వాసం ప్రకారం అరటి చెట్టులో బృహస్పతి.. పురాణాల ప్రకారం విష్ణువుకి నెలవు. కనుక గురువారం అరటి చెట్టును పూజిస్తారు. అరటిపండ్లు కూడా విష్ణువుకు నైవేద్యంగా పెడతారు కనుక. గురువారం అరటి పండు తినడం నిషేధించబడింది. మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించే పండ్లలో అరటిపండ్లును తప్పని సరిగా చేర్చాలి. అయితే గురువారం ఉపవాసం ఉన్న భక్తులు లేదా మరెవరూ గురువారం అరటిపండ్లు తినకూడదు.

కిచిడీ తినొద్దు

గురువారం రోజుకి పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పప్పు, బియ్యం కలిపి తయారు చేసే కిచిడీ కూడా పసుపు రంగులో ఉన్నప్పటికీ.. గురువారం నాడు పొరపాటున కిచిడీ తినొద్దు. గురువారం రోజున కిచిడీ తింటే ఆర్థిక నష్టం, కుటుంబంలో దారిద్ర్యంతో ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం. కనుక గురువారం రోజున కిచిడీని వండకండి లేదా తినకండి.

ఇవి కూడా చదవండి

జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించవద్దు

గురువారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవ్ చేసుకోవడం అశుభం. గురువారం రోజున ఈ పనులన్నీ చేస్తే జాతకంలో బృహస్పతి స్థానం క్షీణించడం ప్రారంభిస్తుందని.. బృహస్పతి క్షీణించడంతో ధన సంపాదన ఆగిపోయి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్ముతారు. అలాగే గురువారం మహిళలు తలకు స్నానం చేయడం.. బట్టలు ఉతకడం నిషేధించబడింది. అంతే కాకుండా గురువారం ఇంటి నుంచి చెత్తను బయటకు తీయకూడదు.

శ్రీహరి అనుగ్రహం కోసం ఏం చేయాలంటే?

  1. గురువారం పూజ సమయంలో శనగ పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. కనుక వీలైతే ఈ రోజున శనగ పప్పును ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ఉప్పును తినకూడదు. వీలైతే ఈ రోజున ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. గురువారం పప్పును దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  2. విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక ఈ రోజున పసుపు రంగుని ఎక్కువగా వాడాలి. పసుపు వస్త్రాలు ధరించి విష్ణువుకు పసుపు వస్త్రాలు సమర్పించండి. పసుపు పువ్వులు, పసుపు గంధం, పప్పు, కుంకుమ, శనగ పిండి లడ్డు మొదలైన వాటిని కూడా పూజలో ఉపయోగించాలి.
  3. పూజానంతరం పసుపు వస్తువులను దానం చేయడం ద్వారా విష్ణువు కూడా సంతోషిస్తాడు. ఇంటికి ఆనందం , శ్రేయస్సును కలిగి ఉంటాడు.
  4. గురువారం విష్ణుపూజ చేసిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి