Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
మార్చి 24, 2026 మంగళవారం దిన ఫలాల ప్రకారం పలు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతులు, ఆదాయ వృద్ధి అవకాశాలు ఉండగా, మరికొందరికి శుభవార్తలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే కొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రోజు చాలా రాశుల వారికి పురోగతి, సానుకూల మార్పులు కలిగించే రోజు.

దిన ఫలాలు (మార్చి 24, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. భరణి నక్షత్రం వారు మరింత ఎక్కువగా లాభపడ తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశినాథుడైన శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల, ధన స్థానంలో గురువు బలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. రోహిణి నక్షత్రం వారు శుభవార్తలువింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పునర్వసు నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పుష్యమి నక్షత్రం వారు ఆర్థికంగా అత్యధికంగా ప్రయోజనం పొందుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. పుబ్బ నక్షత్రంవారు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు పొందు తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపా రాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. స్వాతి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. జ్యేష్టా నక్షత్రం వారికి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవమర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల నుంచి కీలక సమాచారం అందుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అంచనాల్ని మించి అభివృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఊహించని రాజయోగం పడుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందు తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. శతభిషం నక్షత్రం వారికి ఆకస్మిక దన ప్రాప్తి కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే బాగా సఫలమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కలిసివస్తుంది.