Horoscope Today (March 30, 2023): ఆ రాశులకు చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు..
తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (మార్చి 30) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (మార్చి 30) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆశించిన విధంగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. సహచరుల సహకారం కూడా తీసుకోండి. కోపతాపాలకు ఇది సమయం కాదు. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన లాభం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో విహారయాత్ర చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. ఇల్లు మారాలన్న ఆలోచనను వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు పర్వాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ సమస్యలు చక్కబడతాయి. బంధువులతో అపార్ధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కొద్దిగా రుణ బాధ తగ్గించుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళ్తారు.
తుల(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయ పడతారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు బావుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. గృహ, వాహనాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొన్ని పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొండి బాకి ఒకటి వసూల్ అవుతుంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి. పొదుపు పాటిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. బంధువులలో ఒకరు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో మంచి ప్రమోషన్ అందే సూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..