Lord Shaniswara: మీ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే శనీశ్వరుడు శుభ స్తానంలో ఉన్నట్లే.. అవి ఏమిటో తెలుసా

ఒక వ్యక్తి జాతకంలో శని స్థానం చాలా ముఖ్యమైనది. జాతకంలో శని ఏదో ఒక చోట ఉంటాడు. అయితే అది శుభమో, అశుభమో.. అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు వారి జాతకాన్ని విశ్లేషించడం ద్వారా మాత్రమే తెలుస్తుంది.

Lord Shaniswara: మీ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే శనీశ్వరుడు శుభ స్తానంలో ఉన్నట్లే.. అవి ఏమిటో తెలుసా
Shaniswarudu
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2023 | 9:00 AM

జ్యోతిష్య శాస్త్రంలో శనిశ్వర గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శనీశ్వరుడు అన్ని గ్రహాలోకెల్లా అతి నెమ్మదిగా నడిస్తే గ్రహం. దీంతో శని ప్రభావం స్థానికుల జీవితంలో చాలా కాలం పాటు ఉంటుంది. సూర్య పుత్రుడు శనీశ్వరుడు జ్యోతిషశాస్త్రంలో న్యాయం, కర్మల ప్రధాతగా పరిగణింపబడుతున్నాడు. శనీశ్వరుడు వ్యక్తుల కర్మల ఆధారంగా మాత్రమే శుభ , అశుభ ఫలితాలను ఇస్తాడు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభ గృహంలో ఉంటాడో.. ఆ వ్యక్తి ఒక స్థాయి రాజు కంటే ఏ మాత్రం తక్కువ కాదు.

శనీశ్వరుడు అనుగ్రహంతో.. వ్యక్తి అన్ని రకాల సంతోషాలతో కూడిన జీవితాన్ని పొందుతాడు. అతని జీవితంలో సంపద, గౌరవం, ఆనందం-శ్రేయస్సు , మంచి  స్థానం-ప్రతిష్ఠలను పొందుతాడు. అయితే ఎవరి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ కారణంగా..  ఒక వ్యక్తి జాతకంలో శని స్థానం చాలా ముఖ్యమైనది. జాతకంలో శని ఏదో ఒక చోట ఉంటాడు. అయితే అది శుభమో, అశుభమో.. అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు వారి జాతకాన్ని విశ్లేషించడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. జాతకాన్ని విశ్లేషించడమే కాకుండా..  శని ఒక వ్యక్తికి శుభమో, అశుభమో.. జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

శని శుభ సంకేతాలు

  1. ఒక వ్యక్తి తన జీవితంలో అకస్మాత్తుగా గౌరవం, కీర్తి, సంపద , ఉన్నత స్థానాన్ని పొందినప్పుడు, శనీశ్వరుడు వారి జాతకంలో శుభ ప్రదేశంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి.
  2. జాతకంలో శని శుభ స్థానంలో ఉన్నప్పుడు మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తికి  ఎక్కడనుంచి అయినా డబ్బు వస్తుంది.
  3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో శనిదేవుడు ఎప్పుడైతే ఉత్కృష్టంగా ఉంటాడో.. ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఆ వ్యక్తికి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.
  4. జాతకంలో శని ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, వ్యక్తి తన వృత్తిలో ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు. అతను ఏ ప్రాంతంలో ఉన్నా, అతనికి చాలా కీర్తి, సంపదలు లభిస్తాయి.
  5. శని శుభ దృష్టిలో ఉన్నప్పుడు మనిషికి మంచి గౌరవం లభిస్తుంది.  ముఖ్యమైన పని అతనికి అనుకూలంగా ఉంటుంది.
  6. జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. అటువంటి వ్యక్తి జుట్టు, కళ్ళు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి.
  7. ఎవరి జాతకంలో శని ఒక శుభ స్థానంలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి అకస్మాత్తుగా ధనాన్ని పొందుతాడు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!