Horoscope Today: 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు.. వారి కుటుంబంలో ఉల్లాస వాతావరణం
మేష రాశి, వృషభ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాడు (15 సెప్టెంబర్ 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేష రాశి, వృషభ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాడు (15 సెప్టెంబర్ 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల బలం చాలావరకు అనుకూలంగా ఉంది. లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు కూడా మంచి యోగం కలిగిస్తాడు. వృత్తి, ఉద్యోగంలో ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. పిల్లలకు విద్య, ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి శుభ వార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చతుర్థ స్థానంలో ఉన్న రవి, బుధులు వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, సామాజికంగా హోదా పెంచడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు మెరుగుపడ తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆస్తి సంబంధమైన కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యల విషయంలో చాలాకాలంగా పడుతున్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పెండింగ్ పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలావరకు మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒకటి రెండు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆలస్యం తప్పక పోవచ్చు. సహోద్యోగులు, సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. నిరు ద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగానే లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ, వ్యాపారాలలో వేగం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అనుకోకుండా దైవకార్యాల్లో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి బాగా అధికం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు శుభవార్తలు తీసుకువస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆలయాల సందర్శన చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ఆలోచన చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. ఒకరిద్దరు బంధు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యానికేమీ ఇబ్బంది ఉండదు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. చదువులు, ఉద్యోగాల్లో పిల్లలకు కూడా శుభవార్తలు అందుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ పెద్దల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి. ఇంట్లో కొందరు దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.