Zodiac Signs: వారి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. సమీప భవిష్యత్తులో వారికి జీవితంలో వృద్ధి పక్కా..!

జ్యోతిష శాస్త్రం ప్రకారం 3, 6, 10, 11 స్థానాలు వృద్ధి స్థానాలు. వీటినే ఉపచయ స్థానాలంటారు. ఈ స్థానాలలో ఉన్న గ్రహాలను బట్టి, ఈ స్థానాలలో సంచరిస్తున్నగ్రహాలను బట్టి జాతకంలో వృద్ధి లేదా ఎదుగుదల అనేది ఉంటుందా, లేదా అన్నది నిర్ణయించాలి. జ్యోతిష శాస్త్రంలోని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథం ఈ స్థానాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.

Zodiac Signs: వారి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. సమీప భవిష్యత్తులో వారికి జీవితంలో వృద్ధి పక్కా..!
Zodiac Signs In Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 13, 2023 | 6:25 PM

Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం 3, 6, 10, 11 స్థానాలు వృద్ధి స్థానాలు. వీటినే ఉపచయ స్థానాలంటారు. ఈ స్థానాలలో ఉన్న గ్రహాలను బట్టి, ఈ స్థానాలలో సంచరిస్తున్నగ్రహాలను బట్టి జాతకంలో వృద్ధి లేదా ఎదుగుదల అనేది ఉంటుందా, లేదా అన్నది నిర్ణయించాలి. జ్యోతిష శాస్త్రంలోని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథం ఈ స్థానాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నాలుగు స్థానాలలో గ్రహాలుంటే తప్పకుండా అపర కుబేరుడు అవుతాడు. ఏ రంగంలో ఉన్నా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఒక స్థానంలో గ్రహం ఉన్నా మంచిదేనని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. సమీప భవిష్యత్తులో వృద్ధిలోకి రావడానికి సంబంధించి ఏయే రాశులకు ఈ స్థానాలలో గ్రహస్థితి ఎలా ఉందనేది పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి ప్రస్తుతం ఆరు, పదకొండవ స్థానాలలో కుజుడు, శనీశ్వరుడు సంచరిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. పదకొండవ స్థానంలో బలమైన శనీశ్వరుడి సంచారం కారణంగా ఆదాయం బాగా పెరగడం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం వంటివి కూడా జరుగుతాయి. ఆరవ స్థానంలోని కుజుడి వల్ల రుణ సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు.
  2. వృషభం: ఈ రాశివారికి 3వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల అటు వృత్తి, ఉద్యోగాలపరంగానూ, ఇటు ఆర్థికంగానూ బాగా ప్రాబల్యం పెరుగు తుంది. 10లో శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. 6వ స్థానంలో కేతువు వల్ల రోగ భయం ఉండదు. 3వ స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి వేగంగా ఎదుగుదల ఉండడంతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి 3వ స్థానంలో బుధ, రవులు, 11వ స్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదాపరంగా ఎదుగుదల ఉంటుంది. జీతభత్యాల పరంగా కూడా వృద్ధి ఉంటుంది. ఊహించని విధంగా ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, సామాజికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. శక్తి సామర్థ్యాలకు సర్వత్రా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి 3వ స్థానంలో ఉన్న కుజుడు, 10వ స్థానంలో ఉన్న గురు, రాహువులు తప్పకుండా వృత్తి, ఉద్యోగ సంబంధమైన పురోగతిని ఇస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా ఘన విజయాలు సాధి స్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు సాను కూలంగా పరిష్కారం అవుతాయి. పదవ స్థానంలో ఉన్న గురు, రాహువుల వల్ల విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి.
  5. సింహం: ఈ రాశివారికి ఒక్క మూడవ స్థానంలో కేతువు తప్ప మిగిలిన మూడు స్థానాల్లో గ్రహాలు లేనందువల్ల సాధారణ వృద్ధి మాత్రమే ఉంటుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు సామాజికంగానూ గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఇదివరకటికన్నా సఖ్యత పెరుగుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తా శ్రవణం ఉంటుంది.
  6. కన్య: ఈ రాశివారికి 6లో శనీశ్వరుడు, 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలలో తప్ప కుండా వృద్ధి ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం కూడా పెరుగుతుంది. జీవితంలోని కొన్ని లోటు పాట్లు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, శత్రు పీడ నుంచి విముక్తి లభి స్తుంది. పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అనేక ఆదాయ మార్గాల ద్వారా ఆదాయ వృద్ధి ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడే సూచనలున్నాయి.
  7. తుల: ఈ రాశివారికి 10వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో రవి, బుధులు సంచరిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి ఢోకా ఉండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఈ రెండు అంశాల్లో తప్ప కుండా ఆశించిన అభివృద్ధి, ఎదుగుదల అనుభవానికి వస్తాయి. వ్యాపారాల్లోకూడా అంచనా లకు మించి లాభాలు చవి చూడడం జరుగుతుంది. పదవ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. 11లో ఉన్న రవి, బుధుల వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  8. వృశ్చికం: ఈ రాశివారికి 6వ స్థానంలో గురు, రాహువులు, 10వ స్థానంలో రవి, బుధులు, 11వ స్థానంలో కుజుడు ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది. 6లో గురు, రాహువుల వల్ల శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గిపోతాయి. 10, 11 స్థానాల్లోని గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా అధికారం చేపట్టడం, ఆదాయానికి లోటు లేకపోవడం, జీత భత్యాలు అంచనాలకు మించి పెరగడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.
  9. ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో ఉన్న శనీశ్వరుడు కొండంత అండ. పదవ స్థానంలో ఉన్న కుజుడు వృత్తి, ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తాడు. మంచి సంస్థల్లో అధికారం కట్టబెడతాడు. 3వ స్థానంలో ఉన్న శనీశ్వరుడివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం వంటివి జరుగుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ రంగంలోని వారికైనా ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది.
  10. మకరం: ఈ రాశివారికి 10వ స్థానంలో ఉన్న కేతువు మాత్రమే వ్యక్తిగత పురోగతికి సహాయపడుతుంది. ఈ కేతువు ఎప్పుడు, ఎలా ఎదుగుదలకు తోడ్పడతాడన్నది ఊహించలేని విషయం. ఎక్కువగా ఆశించని, ఊహించని సానుకూల పరిణామాలే చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత జీవితంలో అకస్మాత్తుగా మార్పులు ప్రారంభం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా మారిపోతాయి. అయితే, తప్పకుండా కేతువు పురోగతికి తోడ్పడతాడు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది.
  11. కుంభం: ఈ రాశివారికి 3వ స్థానంలో గురు, రాహువులు, ఆరవ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల కొంచెం ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నమూ సత్ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు సైతం బాగా తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య బాధ చాలావరకు తగ్గుతుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది.
  12. మీనం: ఈ రాశివారికి 6వ స్థానంలో రవి, బుధులు సంచరించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏ వృత్తివారికైనా ఆశించిన గుర్తింపు లభించడం, డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా శుభవార్తలు మోసుకువస్తాయి. మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!