Horoscope Today: నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope: మేష రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. 12 రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గురువారంనాడు (సెప్టెంబర్ 14) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Daily Horoscope: మేష రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. 12 రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గురువారంనాడు (సెప్టెంబర్ 14) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశిలో గురువు, అయిదవ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరి ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఒక్క ఆరోగ్యం విషయం చూసుకుంటే అంతా వీరనుకున్నట్టే జరిగిపోతుంది. సమయం బాగా అను కూలంగా ఉన్న విషయాన్ని గమనించాలి. వృత్తి, ఉద్యోగాల్లో వీరు అందలాలు ఎక్కుతారు. వ్యాపారాల్లో వీరికి పోటీయే ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సుఖ సంతోషాలకు, సామాజిక హోదాకు సంబంధించిన నాలుగవ స్థానంలో బుధ, రవులు కలిసి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో వీరికి తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి వార్త అందుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): లాభ స్థానంలో సంచరిస్తున్న గురువు, ధన స్థానంలో ఉన్న శుక్రుడు, భాగ్య స్థానంలో ఉన్న శనీ శ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి, అధికార లాభంతో పాటు, ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్న వారికి ఉపశ మనం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు అందుకుంటారు. అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపారాలు ఆర్థికపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రాశిలో ఉన్న శుక్రుడు, ధన స్థానంలో ఉన్న రవి, బుధుల వల్ల ఆదాయం, ఆరోగ్యం,పురోగతి సంతృప్తికరంగా ఉంటాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అష్టమ శని వల్ల ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందు తుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో బుధ, రవుల కలయిక చోటు చేసుకోవడం, ఈ కలయిక మీద గురువు శుభ దృష్టి పడడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడం, ఏదో ఒక రూపంలో అదృష్టం పట్టడం, సామాజిక హోదా పెరగడం వంటివి జరుగుతాయి. మీ ప్రతిభా పాటవాలతో అధికారులను ఆకట్టు కుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన విధం గానే కోరుకున్న సంస్థలో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గ్రహ సంచారం కాస్తంత ప్రతికూలంగా ఉన్నందువల్ల ప్రతి పనిలోనూ ఆచతూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగానే సాగిపోతాయి కానీ, కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం అనుకూలంగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి అత్యధిక సంఖ్యాక గ్రహాల అనుకూలత ఉండడం వల్ల రోజంతా సానుకూలంగా జరిగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపార భాగస్వా ములు అనుకూలంగా మారుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రతి రంగంలోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుం టారు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ప్రస్తుతం రవి, బుధ, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కెరీర్ పరంగా ఆశించిన లబ్ధి చేకూరుతుంది. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశినాథుడైన గురువు పంచమ స్థానంలో ఉండి ఈ రాశిని వీక్షిస్తున్నందువల్ల ఎటువంటి దోషా లున్నా తొలగిపోతాయి. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయానికి, పురోగతికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. అధికారులకు మీ ఆలోచనలు, అభిప్రాయాలు బాగా నచ్చుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలతోపాటు ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, శుక్రుల బలం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభించడం, ఆదా యం పెరగడం వంటివి జరుగుతాయి. సమాజంలో ఈ రాశివారి మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పట్టుదలతో బరువు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా శారీరకంగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సప్తమ స్థానంలో ఏర్పడిన బుధ, రవుల కలయిక వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పని భారం పెరిగినా సరైన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ధన స్థానంలో సంచరిస్తున్న గురు, రాహువుల వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశంఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగ పడతాయి. పంచమ స్థానంలో ఉన్నశుక్రుడి వల్ల పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. కోపతాపాలను నిగ్రహించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.