కన్య: ఈ రాశికి అయిదు, ఆరు స్థానాలకు అధిపతి అయిన శని పూర్తి స్థాయిలో శుభుడు కాడు. అయితే, ఈ రాశ్యధిపతి బుధుడికి స్నేహితుడు కావడం వల్ల మధ్య మధ్య కొన్నిశుభ ఫలితాలను కూడా ఇస్తాడు. ఆటంకాలు, అవరోధాలు, అగ్నిపరీక్షల తర్వాత ఆశించిన శుభ ఫలితాలనిస్తాడు. పురోగతి ఉంటుంది కానీ ఆలస్యంగా అది చేతికి అందుతుంది. ప్రస్తుతం ఈ శనీశ్వరుడు ఈ రాశికి ఆరవ స్థానంలో
సంచరిస్తూండడం వల్ల, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.