Zodiac Signs: సెప్టెంబర్ 16 తర్వాత ఈ రాశువారి పంట పండినట్లే.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Mercury Direct Movement 2023: గ్రహాల స్థితిగతులు కొన్ని రాశులవారికి లాభదాయకంగా, మరి కొన్ని రాశులవారికి కష్టదాయకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బుధుడు సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 1:21 గంటలకు వక్ర నివృత్తికి చేరుకుంటాడు. ఫలితంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అమితంగా లాభపడబోతున్నారు. ఇంకా ఈ సమయంలో ఎన్నో శుభ ఫలితాలను, విజయాలను అందుకోనున్నారు. ఇంతకీ బుధుడు వక్ర నివృత్తికి చేరుకోవడం వల్ల ఏయే రాశులకు లాభదాయకంగా ఉండనుందో..
Mercury Direct Movement 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ రాశులను మారుస్తుంటాయి. ఈ మార్పులు రాశిచక్రంలోని 12 రాశుల వారిపై అనుకూల, ప్రతికూల ప్రభావాలను కలగజేస్తాయి. అలాగే గ్రహాల సంచారం కూడా ఇదే విధమైన ఫలితాలను చూపిస్తుంది. అంటే గ్రహాల స్థితిగతులు కొన్ని రాశులవారికి లాభదాయకంగా, మరి కొన్ని రాశులవారికి కష్టదాయకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బుధుడు సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 1:21 గంటలకు వక్ర నివృత్తికి చేరుకుంటాడు. ఫలితంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అమితంగా లాభపడబోతున్నారు. ఇంకా ఈ సమయంలో ఎన్నో శుభ ఫలితాలను, విజయాలను అందుకోనున్నారు. ఇంతకీ బుధుడు వక్ర నివృత్తికి చేరుకోవడం వల్ల ఏయే రాశులకు లాభదాయకంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి: బుధుడి వక్ర నివృత్తి మేష రాశి వారికి లాభదాయంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కెరీర్‌లో ఎదుగుదల, నలుగురిలో కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగరీత్యా విదేశీయానం, వివాదాల నుంచి ఉపశమనం కలుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలోని గొడవలు సర్దుమనుగుతాయి.
మిధున రాశి: బుధుడి వక్ర నివృత్తి మిథున రాశి వారికి ఊహించని లాభాలను ఇచ్చేదిగా ఉండనుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఆర్ధికంగా స్థిరపడతారు. అనూహ్య రీతిలో ధనప్రాప్తి పొందుతారు. ప్రతి కార్యంలో విజయం పొందుతారు.
సింహ రాశి: వక్ర నివృత్తికి బుధుడు చేరుకోవడం వల్ల సింహ రాశివారికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, కష్టానికి తగిన ఫలితం, విజయాలు లభిస్తాయి.
తులా రాశి: బుధుడి సంచారం వక్ర నివృత్తికి చేరుకోవడం వల్ల తులా రాశి వారికి అనూహ్య లాభాలు చేకూరతాయి. ఉన్నట్లుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారాల్లో లాభపడతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కెరీర్‌లో పురోగతి సాధిస్తారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.