- Telugu News Photo Gallery Cricket photos IND vs SL: Kuldeep Yadav becomes Second fastest Indian Bowler to take 150 ODI wickets
IND vs SL: జహీర్, కుంబ్లేను అధిగమించిన కుల్దీప్.. భారత్ తరఫున రెండో ప్లేయర్‌గా రికార్డు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే..?
IND vs PAK: భారత్, శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో రోహిత్ సేన 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. ఇక సోమవారం పాక్‌పై 5 వికెట్లు తీసిన కుల్దీప్.. నిన్నటి మ్యాచ్‌లో లంకపై 4 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇందుకోసం అతను అజిత్ అగార్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లను కూడా అధిగమించాడు.
Updated on: Sep 13, 2023 | 6:56 AM

శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టి మరో సారి మెప్పించాడు. మహీష్ పతిరణ వికెట్‌ను తీయడం ద్వారా లంక 172 పరుగులకే ఆలౌట్ కాగా, ఇది కుల్దీప్ యాదవ్‌కి వన్డేల్లో 150వ వికెట్.

తద్వారా కుల్దీప్ భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో కుల్దీప్ అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్ వంటి దిగ్గజాలను కూడా అధిగమించాడు.

కుల్దీప్ 88 వన్డేల్లో 150 వికెట్లను పడగొట్టగా.. అగార్కర్ 97, జహీర్ 103, కుంబ్లే 106, ఇర్ఫాన్ 106 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

భారత్ తరఫున 150 వన్డే వికెట్లను పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో కుల్దీప్ రెండో స్థానంలో ఉండగా.. మహ్మద్ షమి అగ్రస్థానంలో ఉన్నాడు. షమి 80 మ్యాచ్‌ల్లోనే 150 వికెట్లను పడగొట్టడం ద్వారా ఈ రికార్డ్ సృష్టించాడు.

కాగా, లంకతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులకే పరిమితమైంది. స్వల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక బ్యాటర్లను మన బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో లంక 172 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే భారత్ తరఫున కుల్దీప్ 4.. రవింద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా చెరో 2.. మహ్మద్ సిరాజ్, హార్ది్క్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.




