- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli Rohit Sharma pair becomes the fastest to complete 5000 runs in ODI history in just 86 innings check full list
Virat Kohli – Rohit Sharma: 32 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ, రోహిత్ జోడీ.. అదేంటో తెలుసా?
Asia Cup 2023, India Vs Sri Lanka: కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు పూర్తి చేయగా, రోహిత్ 241 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అలాగే ఇదే మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.
Updated on: Sep 12, 2023 | 9:30 PM

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి 1005+ పరుగుల మార్కును దాటారు. అతి తక్కువ అంటే 12 ఇన్నింగ్స్‌ల్లో 1000+ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన భారత్ తొలి జోడీగా నిలిచింది. ఇంతకుముందు రోహిత్, లోకేష్ రాహుల్ 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

వన్డే క్రికెట్‌లో రోహిత్ 10000+ పరుగుల మార్క్‌ను అధిగమించాడు. విరాట్ కోహ్లీ (205 ఇన్నింగ్స్) తర్వాత రోహిత్ (241) వేగంగా 10,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (259), సౌరవ్ గంగూలీ (263), రికీ పాంటింగ్ (266)లను అధిగమించాడు.

విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ భిన్నమైన రికార్డును నమోదు చేశాడు. వీరిద్దరూ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ (8227), శిఖర్ ధావన్-రోహిత్ శర్మ (5193) తర్వాత, రోహిత్-విరాట్ వన్డే క్రికెట్‌లో 5000+ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన మూడో భారత జోడీగా నిలిచారు. కానీ, రోహిత్-విరాట్ 86 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని దాటారు. వీరిద్దరూ 32 సంవత్సరాల క్రితం గోర్డాన్ గ్రీనిడ్జ్ - హైన్స్ (97 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

రోహిత్ 44 బంతుల్లో సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆసియా కప్‌లో (వన్ డే) 10 సార్లు 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ సచిన్ టెండూల్కర్ (9) రికార్డును బద్దలు కొట్టాడు. నవజ్యోత్ సింధు (7), గౌతమ్ గంభీర్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రోహిత్ ఈరోజు వన్డే క్రికెట్‌లో 10,000 పరుగుల మార్క్‌ను దాటాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ తన 241వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని దాటాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఈ మైలురాయిని దాటిన ఆరో భారత ప్లేయర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఆడిన ఇన్నింగ్స్ పరంగా కోహ్లీ తర్వాత ఓవరాల్‌గా 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.





























