ఈ నెల 15, 16, 17 తేదీలలో కన్యారాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. చంద్ర మంగళ యోగాన్ని జ్యోతిష శాస్త్రంలో ధన సమృద్ధి యోగం అని కూడా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఈ యోగం లక్ష్యం ఆదాయం పెరగడం, అప్పులు తగ్గడం. ఈ యోగం పట్టినప్పుడు ఆర్థిక సమస్య లన్నీ బాగా తగ్గుముఖం పట్టడమే కాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కూడా జరుగుతుంది. కన్యా రాశిలో గత కొద్ది కాలంగా సంచరిస్తున్న కుజ గ్రహంతో చంద్రుడు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఆరు రాశులకు లాభం కలగబోతోంది. అవిః వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, మీనం.