AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి పొంచి ఉన్న అక్రమ సంబంధాల ముప్పు.. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి జాగ్రత్త..!

Zodiac Signs: మేషరాశిలో నాలుగు గ్రహాలు కలవడం, శుక్రుడు బలంగా స్వస్థానంలో సంచరిస్తూ ఉండటం వంటి పరిణామాల వల్ల మంచి యోగాలతో పాటు, వివాహేతర సంబంధాల జోరు కూడా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి వివాహేతర సంబం ధాలు ఏర్పడటం అనేది ఎక్కువగా వ్యక్తిగత జాతక చక్రాల మీద ఆధారపడి ఉన్నప్పటికీ..

వారికి పొంచి ఉన్న అక్రమ సంబంధాల ముప్పు.. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి జాగ్రత్త..!
Illicit Affairs Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 29, 2023 | 3:54 PM

Share

Zodiac Signs: మేషరాశిలో నాలుగు గ్రహాలు కలవడం, శుక్రుడు బలంగా స్వస్థానంలో సంచరిస్తూ ఉండటం వంటి పరిణామాల వల్ల మంచి యోగాలతో పాటు, వివాహేతర సంబంధాల జోరు కూడా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి వివాహేతర సంబం ధాలు ఏర్పడటం అనేది ఎక్కువగా వ్యక్తిగత జాతక చక్రాల మీద ఆధారపడి ఉన్నప్పటికీ, ప్రస్తుత గ్రహచార ప్రభావం కూడా దీని మీద తప్పనిసరిగా ఉంటుంది. ఈ వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధాలు కొంత ప్రయత్నాపూర్వకంగా కొంత అప్రయత్నంగా చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. లగ్నంలో లేదా రాశిలో, 11వ రాశిలో, ఏడవ స్థానంలో, అష్టమ స్థానంలో, ద్వితీయ స్థానంలో ఎక్కువ గ్రహాల కలయిక జరిగినప్పుడు వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. లేదా సప్తమ స్థాన అధిపతితో ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు కూడా ఇటువంటి సంబంధాలు ఏర్పడవచ్చు. ప్రస్తుత గోచారం వల్ల మేషం, మిధునం, కన్య, తుల, మీన రాశుల వారికి వివాహేతర లేదా అక్రమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.

  1. మేష రాశి: ఈ రాశిలో గురువు, రాహువు, రవి, బుధ గ్రహాలు చేరి ఉండటం, ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు బలంగా సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారి జీవితంలోకి తప్పనిసరిగా స్త్రీలు లేదా పురుషులు ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఈ రకమైన సంబంధాలు అప్రయత్నంగానే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో గానీ, ప్రయాణాలలో గానీ అనవసర పరిచయాలు ఏర్పడవచ్చు. ఇప్పుడు ఏర్పడే పరిచయాలు మరొక ఐదు ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంది. అక్రమ లేదా వివాహేతర సంబంధాలు ఒకటి కంటే మించి ఉండే అవకాశం కూడా ఉంది. అయితే, ఈ రాశిలో రాహువు కూడా చేరి ఉండటం ప్రమాదానికి సంకేతం. రాహు గ్రహం కారణంగా ఈ అక్రమ సంబంధాలు బహిర్గతం అయ్యే లేదా గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. పరువు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. అనవసర పరిచయాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  2. మిథున రాశి: ఈ రాశి వారికి సప్తమాధిపతి అయిన గురువుతో మూడు గ్రహాలు చేరి ఉండటం వివాహేతర సంబంధాలకు కారణం అవుతోంది. స్నేహితులలో గానీ, ఇరుగుపొరుగు వారితో గానీ వివాహేతర సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. కొంత ప్రయత్నపూర్వకంగా ఈ సంబంధాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబంలో కలతలు ప్రారంభం అయ్యే అవ కాశం ఉంది. ఈ సంబంధాలు వ్యక్తిగత పురోగతికి ఆటంకంగా మారే సూచనలు ఉన్నాయి. కేవలం స్వలాభం కోసం ఈ రాశి వారి జీవితంలోకి స్త్రీలు లేదా పురుషులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురితో సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. లాభ స్థానంలో ఉన్న గురు గ్రహంతో రవి, బుధులు చేరటం ఈ అక్రమ సంబంధాలకు కారణం కాగా, ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్న రాహు గ్రహం వల్ల టెన్షన్లు ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. వివాహే తర సంబంధాలలో భారీగా ఖర్చు కావడానికి రాహువు కారణం అవుతాడు.
  3. కన్యా రాశి: ఈ రాశి వారికి మాంగల్య స్థానం అయిన అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరటం, భాగ్య స్థానంలో శుక్రుడు సంచరిస్తూ ఉండటం అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది. బాగా పరిచయస్తులతో గానీ, మిత్రుల ద్వారా పరిచయం అయిన వారితో గానీ, బంధు వర్గం వారితో గానీ ఇటువంటి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. రెండు మూడేళ్ల పాటు ఈ సంబంధాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. ఈ రహస్య సంబంధాల వల్ల బాగా డబ్బు నష్టం జరగవచ్చు. మనశ్శాంతి కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా దెబ్బతిన్నవారు, మోసగాళ్లు ఈ రాశి వారి జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ అష్టమ స్థానంలోనే పరమ పాప గ్రహం అయిన రాహువు కూడా చేరటం వల్ల ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదు. పైగా ప్రతినిత్యం ఆందోళనలతో జీవితం కొనసాగించాల్సి ఉంటుంది.
  4. తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలోనే నాలుగు గ్రహాలు చేరటం, అష్టమ స్థానం లేదా మాంగల్య స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల తప్పకుండా వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురితో సంబంధాలు ఏర్పడి నప్పటికీ ఆశ్చర్యపోనవసరం లేదు. గురు గ్రహం కారణంగా ఇందులో ఒకరితో ఎక్కువ కాలం ప్రేమాయణం సాగించే అవకాశం ఉంది. వివాహా నికి సిద్ధపడే సూచనలు కూడా ఉన్నాయి. సాధారణంగా బంధువర్గంలో లేదా బాగా సన్నిహితుల్లో ఇటువంటి అక్రమ సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇతరులే ఈ రాశి వారిని ఇష్టపడి సన్నిహితం అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు ఈ రాశి వారి మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కాగా ఈ గ్రహాలలో రాహువు కూడా ఉండటం వల్ల ఈ రకమైన సంబంధాల గుట్టు రట్టయ్యే ప్రమాదం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మీన రాశి: ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల అప్రయత్నంగా ఒకరిద్దరితో అక్రమ సంబం ధాలు ఏర్పడటం జరగవచ్చు. సాధారణంగా డబ్బు కోసం ఆస్తి కోసం వీరి జీవితాలలోకి కొత్తవారు ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఏమాత్రం పరిచయం లేనివారు వీరి జీవితాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సంబంధాలు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అయితే ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ అక్రమ సంబంధాల వల్ల కొద్దిగా కష్టనష్టాలకు లోనవటం జరుగు తుంది. ఈ రాశి వారిలోని మితిమీరిన ఔదార్యం, సహాయం చేసే తత్వం ఈ సంబంధాలు ఏర్పడ టానికి కారణం అవుతాయి. ఈ సంబంధాల వల్ల కుటుంబ పరంగా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలలో ఒకటి రాహు గ్రహం అయినందువల్ల ఈ సంబంధాలు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..