Satur Day Astro Tips: జీవితంలో ఆర్ధిక కష్టాలా.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఇలా చేసి చూడండి..

శని బలంగా ఉంటే.. అతని జీవితం రాజులా వెలిగిపోతుంది. అందుకే శనీశ్వరుడి ఆగ్రహానికి ఎవరూ గురికావాలని అనుకోరు. శని అనుగ్రహం కోసం శనివారం కొన్ని నివారణ చర్యలు, పరిహారాలను జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Satur Day Astro Tips: జీవితంలో ఆర్ధిక కష్టాలా.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఇలా చేసి చూడండి..
Saturday Remedies
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2023 | 8:38 AM

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా ఉంటె ఆ వ్యక్తి కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటారు. అదే శని బలంగా ఉంటే.. అతని జీవితం రాజులా వెలిగిపోతుంది. అందుకే శనీశ్వరుడి ఆగ్రహానికి ఎవరూ గురికావాలని అనుకోరు. శని అనుగ్రహం కోసం శనివారం కొన్ని నివారణ చర్యలు, పరిహారాలను జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రతి శనివారం సూర్యోదయానికి ముందు శనీశ్వరుడిని పూజించాలి. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత పూజిస్తే అయన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. శనీశ్వరుడి శుభ దృష్టి పడినట్లు అయితే.. ఆయన అనుగ్రహంతో వ్యక్తి జీవితమే పూర్తిగా మారిపోతుంది.

శనివారం బ్రహ్మ ముహూర్తంలో పూజ: శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి శనీశ్వరుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో నీలి రంగు దుస్తులను లేదా నలుపు రంగు దుస్తులను ధరించాలి. నీలి రంగు పువ్వులతో పూజించాలి. ఇలా చేయడం వలన జీవితంలో దుఃఖం, కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఆవుకు ఆహారం: హిందూ మతంలో సూర్యుడు తనయుడు శనీశ్వరుడు న్యాయ దేవతగా పరిగణిస్తారు. వ్యక్తి కర్మలకు ఫలితాలను ఇచ్చే శని వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే.. శనివారం ప్రత్యేక చర్యలు పాటించాలి.  శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆవుకు ఆహారాన్ని తినిపించడం వలన శుభఫలితాలను పొందవచ్చు.

కంచు పాత్రలో ఆవ నూనె: ఒక కంచు పాత్రను తీసుకుని దాని నిండా ఆవ నూనె వేయాలి. ఆ నూనె లో ముఖాన్ని పెట్టి నీడను చూడాలి. ఆ నూనెను శనీశ్వరుడి ఆలయంలో పెట్టాలి. అంతేకాదు ఆవు దూడకు ఆహారాన్ని అందించాలి.

నల్లని క్లాత్ లో బియ్యం ముడుపు  ఎవరికైతే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతుంటే.. శనివారం సాయంత్రం ఒక నల్ల క్లాత్ ను తీసుకుని దానిలో బియ్యం పోసి.. ముడుపు కట్టి.. దానిని శనీశ్వరుడు  పాదాల చెంత ఉంచాలి. అనంతరం ఆవ నూనె దీపం వెలిగించాలి. తర్వాత ఆ బియ్యం తీసుకుని  ప్రవహిస్తున్న నదిలో కలిపాలి.

కాకులకు అన్నం:

శనీశ్వరుడు వాహనం కాకులకు నల్లని నువ్వులు కలిపిన అన్నం పెట్టడం వలన శనీశ్వరుడు ప్రభావం నుంచి బయటపడవచ్చు.

శనివారం శివాలయంలో ప్రసాదాన్ని పంచండి. హనుమంతుడిని పూజించాలి. సుందరకాండ పఠనం, శ్రీవారిని దర్శించడం పూజ చేయటం మంచిదట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).