Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Luck Sign: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మంచి రోజులు మొదలవుతాయని నమ్మకం. అవి ఏమిటో తెలుసుకోండి…

కొందరికి ఈ అదృష్టాన్ని సులువుగా అందుకుంటే మరికొందరికి చాలా సమయం పడుతుంది. మీరు కూడా మీ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. తప్పకుండా అదృష్టానికి సంబంధించిన శుభ సంకేతాల గురించి తెలుసుకోండి.. 

Good Luck Sign: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మంచి రోజులు మొదలవుతాయని నమ్మకం. అవి ఏమిటో తెలుసుకోండి...
Good Luck Sign
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2023 | 11:41 AM

ఆనందం, అదృష్టం, విజయం ఈ మూడు తమ జీవితంలో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసం  ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు. తాము అదృష్టాన్ని సొంతం చేసుకోవడనికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ అదృష్టం అందరికీ సులభంగా రాదు. కొందరికి ఈ అదృష్టాన్ని సులువుగా అందుకుంటే మరికొందరికి చాలా సమయం పడుతుంది. మీరు కూడా మీ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. తప్పకుండా అదృష్టానికి సంబంధించిన శుభ సంకేతాల గురించి తెలుసుకోండి..

హిందూ విశ్వాసం ప్రకారం దేవుళ్లను ఆరాధించే సమయంలో అదృష్టం, దురదృష్టాలకు సంకేతాలు ఇస్తాయని నమ్మకం. పూజ చేస్తున్నప్పుడు పొరపాటున దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే, దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం.

ఒక వ్యక్తి అరచేతిలో దురద మొదలైతే.. అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచన వస్తుందని హిందువుల విశ్వాసం. అయితే, పురుషులు, స్త్రీలకు, పురుషులకు కుడి చేతి.. స్త్రీలకు ఎడమ చేయి వంటి వేర్వేరు చేతులు ఈ సంకేతాలు వస్తాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

జీవితంలో వచ్చే శుభ సంకేతాలను ఇంట్లోనే కాదు.. ఇంటి బయటకి వచ్చినప్పుడు కూడా కనిపిస్తాయి. ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్లిన సమయంలో ఒక వ్యక్తి లేదా స్వీపర్ రోడ్డును తుడుస్తూ ఎదురైతే.. అది విజయాన్ని.. మంచి ప్రయోజనాలను ఇస్తుందని విశ్వాసం.

హిందూ విశ్వాసం ప్రకారం పిల్లి ఏడ్వడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది, అదే పిల్లి ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుందని.. దయ కలుగుతుందని విశ్వాసం. ఆ ఇల్లు సంపద, ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం.

హిందూ మతంలో ఏనుగును గణేశుడికి చిహ్నంగా చూస్తారు. వినాయకుడు శుభం, లాభాలకు దేవుడిగా పరిగణించబడుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతుంటే.. దారిలో మీకు ఏనుగు కనిపిస్తే దానిని శుభ సంకేతంగా పరిగణించాలని నమ్మకం. ఆలయ సముదాయంలో ఏనుగును చూసినప్పుడు ఈ ఐశ్వర్యం మరింత పెరుగుతుంది. ఏదైనా పని మొదలు పెడితే.. ఏనుగుని దర్శించడం విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).