Lunar Eclipse: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం.. ఈ 4 రాశులకు అన్నీ అష్టకష్టాలేనట.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి
ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణం ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపిస్తుంది. అయితే భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు. కనుక సూత కాలం ఉండదు. అయితే గ్రహణం ప్రభావం రాశులపై కచ్చితంగా ఉంటుంది. కావున గ్రహణ సమయంలో ఆయా రాశులవారు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. మే 5న ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణాలు మూడు రకాలు ఉన్నాయి. అవి వరుసగా పాక్షిక చంద్రగ్రహణం, పెనుంబ్రల్ చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. పాక్షిక చంద్రగ్రహణంలో చంద్రునిలో కొంత భాగం కనిపించదు. దీనిని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహణ పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణం ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపిస్తుంది. అయితే భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు. కనుక సూత కాలం ఉండదు. అయితే గ్రహణం ప్రభావం రాశులపై కచ్చితంగా ఉంటుంది. కావున గ్రహణ సమయంలో ఆయా రాశులవారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సంవత్సరంలో ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణం.. ఈ నాలుగు రాశుల వారికి అశుభాన్ని కలిగించనుంది. ఈ రోజు ఆ రాశుల గురించి తెలుసుకుందాం..
మేష రాశి
ఈ రాశి వారికి ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణం అశుభం కానుంది. ఇందుకోసం మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు. చంద్రగ్రహణం రోజున మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ రోజున చంద్ర మంత్రం ఓం శ్రామ్ శ్రీం శ్రౌం సః చంద్రమసే నమః” జపించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణం ఇబ్బందులను కలుగజేస్తుంది. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో వాగ్వివాదం చేయకండి. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు అశాంతితో ఉంటారు.
కర్కాటక రాశి
ఈ రాశివారికి సంవత్సరంలో ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణం అశుభాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చంద్రగ్రహణం సమయంలో శివయ్యను పూజించండి.
సింహరాశి
ఈ రాశి వారికి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఇబ్బందులను తెస్తుంది. చంద్రగ్రహణం ఈరోజున ఏదైనా అశుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. ఏ విధమైన నిర్ణయాలను వెంటనే తీసుకోవద్దు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).