Weekly Horoscope (30 ఏప్రిల్ – 6 మే): ఆ రాశివారికి గృహ, వాహన సౌఖ్యాలు..! 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం (30 ఏప్రిల్ 2023) నుంచి వచ్చే శనివారం (06 మే 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Weekly Horoscope: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం (30 ఏప్రిల్ 2023) నుంచి వచ్చే శనివారం (06 మే 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. కొన్ని అప్పులు వసూలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరో గ్యంలో సానుకూడా మార్పులు చోటుచేసుకుం టాయి. అయినప్పటికీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇతర టెక్నాలజీ నిపుణులు బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులు సహకారుల నుంచి ఆశించిన ఆదరణ ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అయితే ఖర్చుల్ని కొద్దిగా అదుపు చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రుణ సమస్యను లేదా ఆర్థిక సమస్యలను చాలా వరకు తగ్గించుకుంటారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులతో అపార్ధాలు లేదా విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. అనవసర పరిచయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం ఈ రాశి వారికి సమయం అంతా సుఖ సంతోషాలలో గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపు తారు. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి నిపుణులు పురోగతి చెందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు అందవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశి వారికి ఈ వారం అంతా ఉద్యోగ పరంగా ప్రశాంతంగా గడిచిపోతుంది. సకాలంలో లక్ష్యాలను లేదా బాధ్యతలను పూర్తి చేసి అధికారుల ప్రశంసలను అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు శ్రమ మీద ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణ యాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. పొదుపు పాటించడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలను అనుసరిం చాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మధ్య మధ్య కొద్దిగా ఇబ్బందులు తీసుకువస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనా రోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిరుద్యో గులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో మధ్య మధ్య చికాకులు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. సహనంతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా సహచరుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి ప్రస్తుతానికి పోవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా సానుకూలంగా గడిచిపోతుంది. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి సంభవిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి వెంటనే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. వడ్డీ వ్యాపారం చిట్స్ వంటి ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించినంత కాకపోయినా కొద్దిగా మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈ రాశి వారు ఈ వారం ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగ పరంగా చిన్నా చితకా సమస్యలు ఉంటాయి. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సర్దుకు పోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ రాశి వారికి ఈ వారం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ ప్రయత్నం మొదలు పెట్టినా అది తప్పకుండా విజయవంతం అవు తుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు లేదా అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. మనసులోని కోరికలలో ఒకటి రెండు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు చేతికి వస్తాయి. ఉద్యోగం లో ఉన్నవారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారు లాభాలపరంగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకు పోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఈ రాశి వారికి ఈ వారం అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోవడం జరగకపోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. అయినప్పటికీ ఆహారం నియమాలు పాటించడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రావు. ముఖ్యమైన విషయా లలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి చిన్న పనికి శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు. డబ్బు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. శరీరానికి మధ్య మధ్య విశ్రాంతి అవసరం. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశి వారికి ఈ వారం అంతా హ్యాపీగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం చాలావరకు అను కూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. బంధువర్గంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..