Surya Dosh: జాతకంలో సూర్య దోషమా.. ఆరోగ్య సమస్యలా.. ఆదివారం ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..

ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకాలు ఏర్పడడం లేదా అనవసరమైన సమస్యలు రావడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో దోషం కూడా దీని వెనుక ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే, ఖచ్చితంగా ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేయండి.

Surya Dosh: జాతకంలో సూర్య దోషమా.. ఆరోగ్య సమస్యలా.. ఆదివారం ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..
Surya Dosh
Follow us

|

Updated on: Apr 30, 2023 | 8:12 AM

జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలున్నాయి. ఈ గ్రహాలకు రాజు సూర్యుడుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. వారంలో ప్రతి రోజు ఒకొక్క దేవీ దేవతలకు అంకితం  చేయబడింది. ఆయా దేవుళ్లను ఆయా రోజున అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆదివారం సూర్య భగవానునికి అంకితం  చేయబడింది. అందుకనే  ప్రత్యేక దైవం సూర్యుడిని పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుడుకి సంబంధించిన చర్యలు తీసుకోవడం ద్వారా సంతోషంగా ఉంటారు. ప్రత్యేక ఆశీర్వాదాన్ని పొందుతారు.

ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకాలు ఏర్పడడం లేదా అనవసరమైన సమస్యలు రావడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో దోషం కూడా దీని వెనుక ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే, ఖచ్చితంగా ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేయండి. దీంతో మీ జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. జాతకంలో బలహీనమైన సూర్యుడు బలపడడానికి సంబంధించిన కొన్ని చర్యలు తెలుసుకుందాం.

  1. జాతకంలో సూర్యుడిని బలపరిచే పరిహారాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముందుగా ఆదివారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి. దీని తర్వాత శుభ్రమైన గ్లాసులో నీటిని తీసుకుని అందులో కొన్ని అక్షతలు, పుష్పాలు,  దర్భలు వేసి ఆ నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా రోజూ అర్ఘ్యన్ని సమర్పించడం వల్ల సూర్యుడికి సంబంధించిన దోషాలు నివారింపబడతాయని నమ్మకం.
  2. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకానికి సంబంధించిన దోషాలను తొలగించడానికి రత్నాలను ధరించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే..  కెంపులను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ పరిచారాన్ని పాటించే సమయంలో  జ్యోతిష్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. సనాతన ధర్మం ప్రకారం.. ఆదివారం రావి చెట్టును పూజించడం వల్ల సూర్యుని వలన ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
  5. జాతకంలో సూర్యునికి సంబంధించిన దోషాలు ఉన్నవారు ఆదివారం ఉపవాసం పాటించాలి. అదే సమయంలో ఆదివారం ఉప్పు తినకూడదని గుర్తుంచుకోండి.
  6. సూర్య గ్రహ దోషాలను తొలగించడానికి దానం, దక్షిణ కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బెల్లం, బంగారం, బట్టలు, గోధుమలు మొదలైన వాటిని ఆదివారం నాడు అవసరమైన వ్యక్తికి దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Latest Articles