Astrology: లక్ అంటే ఈ రాశులవారిదే.. మే 5 నుంచి లక్ష్మీకటాక్షం-కనక వృష్టి ఖాయం..! లిస్టులో మీ రాశి కూడా ఉందా..?

Buddha Purnima, Luna Eclipse 2023: ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున బుద్ధ పౌర్ణమి జరుపుకుంటారు. ఇక ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 5న బుద్ధ పౌర్ణమిని నిర్వహించుకుంటాం. లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన శుక్రవారం రోజునే ఈ బుద్ధ పూర్ణిమ..

Astrology: లక్ అంటే ఈ రాశులవారిదే.. మే 5 నుంచి లక్ష్మీకటాక్షం-కనక వృష్టి ఖాయం..! లిస్టులో మీ రాశి కూడా ఉందా..?
Buddha Purnima, Luna Eclipse 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 30, 2023 | 5:36 PM

Buddha Purnima, Luna Eclipse 2023: ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున బుద్ధ పౌర్ణమి జరుపుకుంటారు. ఇక ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 5న బుద్ధ పౌర్ణమిని నిర్వహించుకుంటాం. లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన శుక్రవారం రోజునే ఈ బుద్ధ పూర్ణిమ వచ్చింది. అంతేకాకుండా బుద్ధ పూర్ణిమ రోజునే చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ రాత్రి మే 5వ తేదీ రాత్రి 8.45 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటలకు ఈ చంద్ర గ్రహణం ముగిస్తుంది. ఇక ఈ రోజున కొన్ని రాశులవారి జాతకాలలో శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాలన్నీ రాశిచక్రమంలోని 4 రాశుల వారికే చాలా శుభప్రదమైనవిగా ఉండబోతున్నాయి. ఎందుకంటే బుద్ధ పూర్ణిమ ఈ రాశులవారికి ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: మే 5న జరుపుకోబోయే బుద్ధ పూర్ణిమ మేష రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చనుంది. ఈ రాశికి చెందిన వ్యాపారులకు వ్యాపారాభివృద్ధి, ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం, ఉద్యోగంలో పదోన్నతి, రైతులకు భారీగా ఆదాయం కలగనున్నాయి. ఈ సమయంలో మేషరాశివారు తలపెట్టిన అన్ని పనుల్లోనూ శుభ ప్రయోజనం పొందుతారు.

మిథున రాశి: మిథున రాశి వారికి ఈ బుద్ధ పూర్ణిమ శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఏందులోనైనా విజయం సాధించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి, ఊహించని ఆదాయం కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: సింహ రాశి వారికి కూడా బుద్ధ పూర్ణిమ శుభప్రదంగా ఉండబోతోంది. కోర్టు వివాదాల్లో విజయం, మతపరమైన పనుల పట్ల ఆసక్తి , తలపెట్టిన ప్రతిపనిలోనూ సానుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి.

మకర రాశి: మే 5 తర్వాత మకర రాశి వారికి మంచి కాలం ప్రారంభమవనుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం, ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు, జీవితంలో సుఖసంతోషాలు కలగనున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).