Venus Transit 2023: మిథునంలోకి శుక్రుడు.. ఈ రాశులకు అనూహ్య ధనప్రాప్తి,వ్యాపారాభివృద్ధి.. మీ రాశి ఉందేమో చెక్ చేశారా..?

Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రత్యేక ఫలితాలను చూపిస్తాయి. అయితే ఈ ఫలితాలు కొన్ని రాశులపై శుభప్రదంగానూ, మరి  కొన్ని రాశులపై ప్రతికూలంగానూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఉగాది తర్వాత తొలిసారిగా శుక్రుడు..

Venus Transit 2023: మిథునంలోకి శుక్రుడు.. ఈ రాశులకు అనూహ్య ధనప్రాప్తి,వ్యాపారాభివృద్ధి.. మీ రాశి ఉందేమో చెక్ చేశారా..?
Venus Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 30, 2023 | 7:59 PM

Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రత్యేక ఫలితాలను చూపిస్తాయి. అయితే ఈ ఫలితాలు కొన్ని రాశులపై శుభప్రదంగానూ, మరి  కొన్ని రాశులపై ప్రతికూలంగానూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఉగాది తర్వాత తొలిసారిగా శుక్రుడు ఈ మే 2న మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అలా మే 30 వరకు మిథున రాశిలోనే శుక్రుడు సంచరించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులకు శుభ ఫలితాలు, అనూహ్య లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మిథునంలో శుక్ర సంచారం ఏయే రాశులవారి జాతకాలను మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: మిథునరాశిలో శుక్రగ్రహ సంచారం కారణంగా మేషరాశివారికి శుభఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మేషరాశివారికి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి, కుటుంబంలో ఆరోగ్యం, ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

సింహ రాశి: మిథునరాశిలో శుక్రుడి సంచారంతో ఈ రాశివారికి అనూహ్య ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందడంతో పాటు పదోన్నతులు పొందుతారు. విద్యార్థులకు శుభ ఫలితాలు, వివాహితులకు వైవాహిక జీవితం బాగుటుంది.

ఇవి కూడా చదవండి