May Month Horoscope: ఆ రాశుల వారికి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.. 12 రాశుల వారికి మే మాసఫలాలు..
Monthly Horoscope(May 2023): తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి '01 మే 2023 నుంచి వచ్చే 31 మే 2023 వరకు మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
May Month Horoscope: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ’01 మే 2023 నుంచి వచ్చే 31 మే 2023 వరకు మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశి వారికి ఈ నెల అంతా అన్ని విధాలుగాను కలిసి వచ్చే కాలం. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం లేదా ఉద్యోగం మారడం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ప్రయాణాల మీద విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులు సహచరులు ఈ రాశి వారి మీద ఆధారపడటం ఎక్కువవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. వీరి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు త్వరగా సమకూరుతాయి.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2,)
మీ రాశి వారికి కొద్దిరోజుల్లో ధనయోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డబ్బు తీసుకొని ఆలస్యం చేస్తున్నవారు డబ్బు తిరిగి ఇస్తారు. ముఖ్యమైన అవసరాలు పూర్తి అవుతాయి. విలాసాల మీద, విందుల మీద ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఈ రాశి వారి ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రోహిణి మృగశిర నక్షత్రాల వారు అందరికంటే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ప్రతిరోజు ఉదయం వినాయకుడిని స్మరించుకోవడం చాలా మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలపరంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగంలో మంచి మార్పు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రం వారికి ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర వ్యక్తులకు సహాయం చేసి ఇబ్బంది పడటం జరుగుతుంది. కొంతకాలం పాటు ఇతరులకు వాగ్దానాలు చేయటం కానీ హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దూర ప్రయాణాలకు లేదా తీర్థయాత్రలకు అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల మున్ముందు మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసిన అది తప్పకుండా సఫలం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఈ నెల అంతా చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కూడా సజావుగా ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. నిరుద్యోగులు ఒక మంచి సంస్థలో చేరడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. తనకు మాలిన ధర్మం పనికిరాదని గుర్తించండి. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విందులు వినోదాల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటుతో వ్యవహరించడం మంచిది కాదు. బంధుమిత్రులకు ఆర్థికంగా ఉపయోగపడతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది కానీ కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని తరచూ సంప్రదించడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాగ్దా నాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. ఇతరులతో వ్యవహరించడంలో కూడా వీలైనంత సామరస్యం పాటించడం అవసరం. బంధుమిత్రు లతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమ త్తంగా ఉండటం మంచిది. పెళ్లి ప్రయత్నాలను మరికొంత కాలం పాటు వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. కొందరు మిత్రులు సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగకపోవచ్చు. పుబ్బ నక్షత్రం వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. తరచూ శివాలయానికి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా చికాకు పెడతాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఉద్యోగ పరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు చక్కని పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చేసిన హామీలకు కట్టుబడి ఉంటారు. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే సూచనలు ఉన్నాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. దుర్గాదేవి స్తోత్రం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ వ్యాపారంలో ఉన్నవారు కొద్దిగా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులు బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. వారికి మంచి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ రాశిలో స్వాతి నక్షత్రం వారికి అధికార యోగం పట్టే సూచనలు ఉన్నాయి. మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. కుటుంబ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలు కొత్త పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. తరచూ వినాయకుడిని స్మరించుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడా నికి గట్టి ప్రయత్నాలు చేయాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు అంతిమంగా ఇబ్బంది కలిగిస్తాయి. అద్దె ఇంటివారు ఇల్లు మారే అవకాశం ఉంది. కొత్త ఇల్లు కొనడానికి అవకాశం ఉంది. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి వ్యాపారాలపరంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా సంపాదన ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఎవరికీ ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. ప్రేమ వ్యవహారాలలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్కంద స్తోత్రం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని వీలైనం తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితంలో అదృష్టం పడుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభించినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అయితే, తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువులకు, స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న పూర్వాషాడ నక్షత్రం వారు మంచి యోగాలను అనుభవించడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు. తరచూ దుర్గా దేవిని స్తుతించడం చాలా మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఈ రాశి వారికి ఈ నెల అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం కొన్ని సానుకూల మార్పులకు లోనవుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కూడా అదృష్ట యోగం పట్టిస్తుంది. నిరుద్యోగులకు బాగా దూరప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల వారు, స్వయం ఉపాధి వారు, వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో స్థిరత్వం పొందే సూచనలు ఉన్నాయి. ఆదాయం స్థిరంగా ముందుకు సాగుతుంది. ఆర్థిక సమస్యలు ఒకటి రెండు తప్పకుండా పరిష్కారం అవుతాయి. అయితే, ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఎవరికైనా డబ్బు ఇవ్వటం కానీ, ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఉత్తరాషాడ శ్రవణం నక్షత్రం వారికి ఉద్యోగ పరంగా సమయం మరింత బాగుంటుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు మరింత త్వరగా అనుభవానికి వస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశి వారిని ఏలినాటి శని మధ్య మధ్య కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చికాకు కలిగి స్తాయి. అందువల్ల తప్పనిసరిగా ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా పని భారం పెరిగి విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజ నకంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సహాయపడటం జరుగుతుంది. తరచూ ప్రయా ణాలు చేయవలసి వస్తుంది. వృత్తి నిపుణులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలోని వారు బాగా శ్రమ పడాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువర్గంలో సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితం సామరస్యంగా కొనసాగుతుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం మందకొడిగా సాగుతుంది. తరచూ శివాలయానికి వెళ్ళటం వల్ల దోష పరిహారం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశి వారికి ఈ నెల అంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆధ్యా త్మిక చింతన బాగా పెరుగుతుంది. తీర్థయాత్ర లకు గాని ఆలయాల సందర్శనకు గాని వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. తోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభ కార్యాల మీద దైవకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ దానితో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి రంగంలో ని వారు ఎంతగానో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు స్వయం ఉపాధి వారు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ప్రతినిత్యం ఉదయం వేళ ఆదిత్య హృదయం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..