AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cat vs Dog: పిల్లిని తుక్కుతుక్కుగా కొట్టిన కుక్క.. కానీ అంతలోనే పెను మార్పు.. నెటిజన్లకు తెగ నచ్చేస్తున్న వీడియో..

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలలో పెంపుడు జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనూ ఎక్కువగా ఉండేది పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లుల వీడియోలే సోషల్ మీడియా అంతా కనిపిస్తాయి. సాధారణంగా కుక్కలు, పిల్లులను పరస్పర శత్రువులుగా పేర్కొంటారు. వాటి మధ్య స్నేహం..

Cat vs Dog: పిల్లిని తుక్కుతుక్కుగా కొట్టిన కుక్క.. కానీ అంతలోనే పెను మార్పు.. నెటిజన్లకు తెగ నచ్చేస్తున్న వీడియో..
Cat And Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 30, 2023 | 6:30 PM

Share

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలలో పెంపుడు జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనూ ఎక్కువగా ఉండేది పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లుల వీడియోలే సోషల్ మీడియా అంతా కనిపిస్తాయి. సాధారణంగా కుక్కలు, పిల్లులను పరస్పర శత్రువులుగా పేర్కొంటారు. వాటి మధ్య స్నేహం చిగురించాలంటే కొంత సమయం పడుతుంది. కానీ తొలి రోజుల్లో మాత్రం ఇల్లంతా రగడ రగడే. అయితే అలా గొడవ పడి, తర్వాత స్నేహితులుగా మారిన కుక్క, పిల్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చ హ్యాప్పీ. వాటి మధ్య ఏర్పడిన స్నేహం చాలా అందంగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు.

ఆ వీడియోలో ఒక పిల్లి, కుక్కను మొదటగా కొడుతుంది. అలా ఒక దానిపై ఒకటి పడి మరీ కొట్టుకుంటున్న ఆ మూగజీవాలు ఆ వెంటనే.. ఫ్రెండ్స్‌గా మారి పక్కపక్కనే పడుకుంటాయి. కుక్క అయితే పిల్లిపై ప్రేమగా చేయి వేసి మరీ నిద్రపోతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకనొక దశలో పిల్లిని కొట్టడంతో కుక్క పైచేయి కూడా సాధించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Op (@cat._lvrs)

కాగా, ఈ వీడియోకి ఇప్పటివరకు దాదాపు 18 వేల లైకులు, ఒక లక్షా 76 వేల వీక్షణలు లభించాయి. ఇంకా ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్ల ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు. వాటిలోని బ్యాటరీ పవర్ అయిపోయింది, అందుకే నిద్రపోతున్నాయని ఒకరు కామెంట్ చేయగా, చూడడానికి ఎంత ముద్దుగున్నాయో బుజ్జి కూనలు అంటూ రాసుకొచ్చారు. ఇలా నెటిజన్లు వీడియోపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..