Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాపం పసివాడు..! డ్రైవింగ్ చేస్తూనే శీర్షాసనం వేసిన చిన్నోడు.. వీడియో చూస్తే ఆపకుండా నవ్వేస్తారు..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే నెట్టింట షేర్ చేస్తున్నారు. అలా అవి కాస్త నెటిజన్ల కంట పడగానే వైలర్ అవుతున్నాయి. తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్‌ వీడియో నెట్టింట వైరల్‌గా..

Watch Video: పాపం పసివాడు..! డ్రైవింగ్ చేస్తూనే శీర్షాసనం వేసిన చిన్నోడు.. వీడియో చూస్తే ఆపకుండా నవ్వేస్తారు..
Boy Meets Accident
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 30, 2023 | 6:02 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే నెట్టింట షేర్ చేస్తున్నారు. అలా అవి కాస్త నెటిజన్ల కంట పడగానే వైలర్ అవుతున్నాయి. తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్‌ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

వీడియోలో ఓ చిన్న పిల్లవాడు తన బొమ్మ కారుతో నేలపై ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ దాన్ని స్పీడ్‌గా నేలపై నడుపుతూ ఉండగా, ఎదురు రాయి తగులుతుంది. అప్పుడు కార్‌కి ఏం కాదు కానీ ఆ పిల్లవాడు ఒక్కసారిగా శీర్షాసనం కోసం లేచినట్లుగా ముందుకు పడతాడు. ఇక ఇందుకు సంబంధించన దృశ్యాలను తన కెమెరాలో బంధించిన  వ్యక్తి నెట్టింట షేర్ చేశాడు. అది అలా చక్కర్లు కొడుతున్న క్రమంలో తాజాగా _smiles4miles___ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి కూడా షేర్ అయింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకోవడంతో పాటు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘డ్రైవింగ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం.. తగ్గేదేలే..’ అంటూ రాసుకొచ్చారు. ఇంకొకరు ‘కార్‌కి ఇన్స్యూరెన్స్ ఉందా లేదా..?’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ ‘యాక్సిడెంట్ అయితే వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయాలి కానీ అలా నవ్వరు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 2 వేల లైకులు, 20 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..