- Telugu News Photo Gallery Janasena Leader Nadendla Manohar Interesting Comments on Chandrababu naidu and Pawan Kalyan meeting
Andhra Pradesh: చంద్రబాబు-పవన్ భేటీపై నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘రానున్న కాలంలో మరిన్ని సమావేశాలు’ అంటూ..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో టాక్ ఆఫ్ దీ టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన..
Updated on: Apr 30, 2023 | 4:47 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో టాక్ ఆఫ్ దీ టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రానున్న కాలంలో చంద్రబాబు-పవన్ మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయన్నారు.

‘‘రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు-పవన్ భేటీ అవశ్యం. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన నిత్యం పని చేస్తోంది. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం. విశాఖలో భూదందాలపై కూడా జనసేన పోరాటం చేస్తోంది’’

‘‘వైసీపీ నేతలు ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జగనన్నపై ప్రజలకు నమ్మకం లేదు. వైసీపీ పాలనను ప్రశ్నించిన యువతను ఆ పార్టీ నాయకులు హింసిస్తున్నార’ని నాదెండ్ల పేర్కొన్నారు.

కాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ జోడి ఎప్పుడు కలిసినా సంచలనమే అన్నట్లుగా ఉంటోంది ఆంధ్రా రాజకీయం. ఏపీ పాలిటిక్స్‌లో ఈ కాంబినేషన్‌కున్న క్రేజ్ అలాంటిది. 2014లో సక్సెస్సైన ఈ విన్నింగ్ కాంబినేషన్.. 2024లో కూడా హిట్ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.





























