AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Politics: ఆధార్‌తో అనుసంధానం చేయండి.. నకిలీ ఓట్లపై సీఈఓకు వైసీపీ నేతల ఫిర్యాదు..

నకిలీ ఓట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. దొంగ ఓట్లు, నకిలీ ఓట్లపై ఏపీలోని అధికార ప్రతిపక్షాల ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటరు లిస్టులో డూప్లికేట్‌ ఓటర్లు, చెల్లుబాటుకాని ఓటర్లు, బోగస్‌ ఓటర్లు, ఒకే ఫొటోతో, ఒకే పేరుతో, ఒకే ఓటరు ఐడీ సహ అనేక రకాల లోపాలున్నాయని వైసీపీ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు. ఒకే మనిషికి ఒకే ఓటు ఉండేలా..

Andhra Politics: ఆధార్‌తో అనుసంధానం చేయండి.. నకిలీ ఓట్లపై సీఈఓకు వైసీపీ నేతల ఫిర్యాదు..
AP Politics
Shaik Madar Saheb
|

Updated on: Sep 05, 2023 | 9:28 PM

Share

అమరావతి, సెప్టెంబర్ 05: నకిలీ ఓట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. దొంగ ఓట్లు, నకిలీ ఓట్లపై ఏపీలోని అధికార ప్రతిపక్షాల ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటరు లిస్టులో డూప్లికేట్‌ ఓటర్లు, చెల్లుబాటుకాని ఓటర్లు, బోగస్‌ ఓటర్లు, ఒకే ఫొటోతో, ఒకే పేరుతో, ఒకే ఓటరు ఐడీ సహ అనేక రకాల లోపాలున్నాయని వైసీపీ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు. ఒకే మనిషికి ఒకే ఓటు ఉండేలా చూడాలని వైసీపీ నేతలు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ CEOను కలిశారు. చిన్న మార్పులు, లోపాలతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లున్న కేసులు 40 లక్షల వరకు ఉన్నాయని పేర్ని నాని ఈ సందర్భంగా అధికారులకు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉదాహరణలను కూడా ఎన్నికల ప్రధానాధికారికి అందజేశారు.

ఒకే పేరుతో రెండు ఓట్లు, స్వల్ప మార్పులతో రెండు ఓట్లు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ-రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వ్యక్తుల గురించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలోనూ తాము ఇచ్చిన ఫిర్యాదులు ఇంకా పరిష్కరించలేదని విషయాన్ని CEO దృష్టికి తెచ్చామని వైసీపీ నేత పేర్ని నాని వివరించారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని CEOను కోరినట్టు వెల్లడించారు. దొంగ ఓట్లు నమోదు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని నాని ఆరోపించారు.

ఓటరు జాబితాలో అక్రమాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వివరించారు. ఓటరు లిస్టులో తాము అవకతవకలకు పాల్పడుతున్నామని టీడీపీ, బీజేపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఈ సందర్భంగా ఖండించారు. టీడీపీ నేతల ఆరోపణలు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

కాగా.. అంతకుముందు నకిలీ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. నకిలీ ఓట్ల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేరోజు వైసీపీ ఎంపీలు కూడా నకిలీ ఓట్ల గురించి ఫిర్యాదు చేసింది. పోటాపోటీ ఫిర్యాదులతో నకిలీ ఓట్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..