Andhra Pradesh: ఇది ప్లాన్‌డ్ మర్డర్ అటెంప్ట్.. సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు
ఏపీ ఎన్నికల వేళ విజయవాడలో సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో రాయి విసరడంతో ఎడమ కన్ను పైభాగంలో గాయం అయింది. అయితే, సీఎం జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు, వైసీపీ నేతలు.
ఏపీ ఎన్నికల వేళ విజయవాడలో సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో రాయి విసరడంతో ఎడమ కన్ను పైభాగంలో గాయం అయింది. అయితే, సీఎం జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు, వైసీపీ నేతలు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి నేతలు రగిలిపోతున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు జగన్ పై దాడికి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.. హింసను ప్రేరేపించేలా చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. కుట్రతోనే జగన్‌పై దాడి జరిగిందన్నారు.. ఎయిర్‌గన్ లాంటి దానితో ఎటాక్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాడి వెనుక టీడీపీ ప్రమేయం ఉందని ఆరోపించారు సజ్జల. జగన్‌పై దాడికి ముందు చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశారన్న ఆయన.. వాటికి సంబంధించిన పలు వీడియోలను ప్రదర్శించారు. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్‌డ్ మర్డర్ అటెంప్ట్ అంటూ సజ్జల పేర్కొన్నారు.
జగన్‌పై దాడి వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర.. పక్కా ప్లాన్ ప్రకారమే జగన్‌పై దాడి చేయించారన్నారు. రాళ్లతో కొట్టాలని ఇటీవల చంద్రబాబు రెచ్చగొట్టారని.. TDP నేతల వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్లే చేశారనిపిస్తోందంటూ సజ్జల పేర్కొన్నారు. కాగా.. నిన్నటి దాడి ఘటనలో జగన్‌తోపాటు.. గాయపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పరామర్శించారు సజ్జల.
విజయవాడ దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని.. దాడి వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు. జగన్ టార్గెట్‌గానే దాడి జరిగిందని.. కానీ.. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.
విపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరిగితే.. ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడడం బాధాకరమని.. అచ్చెన్నాయుడు, లోకేష్ విమర్శలు దుర్మార్గమన్నారు. గాయాలయ్యేలా ఎవరైనా రాళ్లు విసిరించుకుంటారా అని ప్రశ్నించిన బుగ్గన.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..