CM Jagan Yatra: మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్.. బస్సుయాత్ర ఎప్పటి నుంచంటే..?
మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం జగన్. సోమవారం మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం కానుంది. తనపై దాడి తరువాత మళ్లీ ప్రజల్లోకి వెళుతున్న వైసీపీ అధినేత.. విపక్షాలను ఏ రకంగా టార్గెట్ చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీ సీఎం జగన్ మళ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. శనివారం జరిగిన దాడిలో సీఎం జగన్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆదివారం బస్సుయాత్రకు విరామం ప్రకటించారు. అయితే సోమవారం యథావిథిగా వైసీపీ అధినేత మళ్లీ బస్సుయాత్ర చేపట్టనున్నారు. సోమవారం కేసరపల్లి నుంచి ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ అక్కడి నుంచి గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, మీదుగా జొన్నపాడు చేరుకుంటుంది.
జొన్నపాడులో భోజన విరామం తరువాత జనార్దణపురం మీదుగా సాయంత్రం గుడివాడకు చేరుకుంటుంది బస్సుయాత్ర. అక్కడ నగవరప్పాడులో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. సభ తరువాత హనుమాన్ జంక్షన్, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. రాత్రి అక్కడ బస చేయనున్నారు.
జగన్‌పై దాడి ఘటన తరువాత ఆయన భద్రత విషయంలో పలు కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం కీలక సూచనలు చేసినట్టు సమాచారం. మరోవైపు తనపై దాడి తరువాత మళ్లీ జనంలోకి వెళుతున్న సీఎం జగన్.. ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారు ? విపక్షాలను ఏ రకంగా టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…