Jagananna Chedodu: రేపు జగనన్న చేదోడు రెండో విడత నగదు జమ.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు
Jagananna Chedodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల..
Jagananna Chedodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, నాయీ బ్రహ్మణులు ఇలా అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇక రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం తీసుకువచ్చిన జగనన్న చేదోడు పథకం కింద రెండో విడత నగదు లబ్దిదారుల ఖాతాల్లో మంగళవారం జమ కానుంది. వీరికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుండగా.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు. ఈసారి ఈ పథకం కింద 1.46 లక్షల మంది టైలర్లు, 98వేల మంది రజకులు, 40వేల మంది నాయీ బ్రాహ్మణులను ఎంపిక చేశారు. రెండో విడతలో మొత్తం 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి బ్యాంకు అకౌంట్లోకి రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.
అయితే ఈ విడతలో ఈ వర్గాలకు చెందిన షాపులున్న వారికి నగదు జమ కానుంది. ఇందులో భాగంగా 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ డబ్బులు జమ చేస్తే ఇప్పటివరకు జగనన్న చేదోడు పథకం కింద రూ.583 కోట్లు విడుదల చేసినట్లు అవుతుంది.
ఇక ఫిబ్రవరి నెలలోనూ పలు పథకాల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఫిబ్రవరిలో మూడు పథకాలను అమలు చేయనుంది. జగనన్న చేదోడు పేరుతో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి చేకూర్చనుంది. వీరిలో అర్హులకు రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. కుల వృత్తులకు సంబంధించి షాపులు ఉండి సరైన అర్హతలుంటే ఈ పథకం వర్తిస్తుంది. అయితే అర్హత గలవారు వాలంటీర్ల ద్వారా నేరుగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: