Owaisi Convoy Attack : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసిన అమిత్‌ షా

Owaisi Convoy Attack : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఏఐఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ..

Owaisi Convoy Attack : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసిన అమిత్‌ షా
Follow us
Subhash Goud

|

Updated on: Feb 07, 2022 | 5:19 PM

Owaisi Convoy Attack : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఏఐఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కాల్పుల ఘటన అనంతరం జరిగిన పరిణామాలను సభకు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు అమిత్‌ షా. హాపుర్‌ జిల్లా పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒవైసీ కారుపై కాల్పులు జరిపారని అమిత్ షా సభలో తెలిపారు. ఈ ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని, కారు కింది భాగంలో మూడు బుల్లెట్‌ గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని అమిత్‌ షా వివరించారు.

ఒవైసీ కారుపై కాల్పుల ఘటన తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కమాండోల ఆధ్వర్యంలో ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పిస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఒవైసీ తిరస్కరించారు. దీనిపై స్పందించిన అమిత్‌ షా కేంద్రం ఇచ్చిన భద్రతను ఓవైసీ అంగీకరించాలని కోరారు.

పోలీసుల అదుపులో ఇద్దరు..

కాగా, ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అమిత్‌ షా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒక కారు, రెండు పిస్టోల్‌లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

అమిత్‌షా ప్రకటనపై ఒవైసీ స్పందన

తనపై జరిగిన కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్‌ షా ప్రకటనపై అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. నాకు సెక్యూరిటీ కల్పించినందుకు ధన్యవాదాలు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సెక్యూరిటీ తీసుకోలేదు. నాకు సెక్యూరిటీ అవసరం లేదని టీఎస్‌ ప్రభుత్వానికి లేఖ రాసిస్తున్నా. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నా. సెక్యూరిటీ కబంధాల్లో ఇరుక్కోవాలనుకోవడం లేదు. సామాన్యుడి భద్రత కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

“మోడీ గారూ.! ఇతనిపై సీబీఐ దర్యాప్తు చేయించండి.. 10 వేల కోట్లు తిన్నాడు…”

NRIs Rallies: అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి ఎన్‌ఆర్‌ఐల మద్దతు.. కార్లతో భారీ ర్యాలీ

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!