“మోడీ గారూ.! ఇతనిపై CBI దర్యాప్తు చేయించండి.. 10 వేల కోట్లు తిన్నాడు…”
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో అందరూ నమస్తే పెట్టారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఒక పత్రం ఇచ్చారు. సార్ కొంచెం దీని గురించి..
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో అందరూ నమస్తే పెట్టారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఒక పత్రం ఇచ్చారు. సార్ కొంచెం దీని గురించి పట్టించుకోండి అంటూ వేడుకున్నాడు. అయితే ఆ సదరు నేత మోడీని ఇక్రిసాట్‌లో కలిసారు. ఆయన అక్కడ కలిసిన విజువల్స్ కూడా బయటకు రాలేదు. ఒక రోజు ఆలస్యంగా అయన మోడీకి వినతి పత్రం ఇస్తున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇంతకు ఆ పత్రంలో ఏముందనే చర్చ ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
నందీశ్వర్ గౌడ్.. పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇటీవల అయన హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోడీని ఇక్రిసాట్‌లో కలిశారు. ఇక్రిసాట్ పటాన్‌చెరువు పరిధిలోకి వస్తుంది. అక్కడి స్థానిక బీజేపీ నాయకుడు కావడంతో మోడీని కలిసే వారిలో నందీశ్వర్ గౌడ్ పేరు ఉంది. మోడీని కలిసిన సమయంలో ఆయన ఓ లెటర్ ఇచ్చారు.
ఆ లేఖలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిపై మోడీకి ఫిర్యాదు చేశారు నందీశ్వర్ గౌడ్. మైపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి పటాన్‌చెరువులో చెరువులు, గ్రేవ్ యార్డులు, వక్ఫ్ బోర్డ్ భూములు, గుడులు ఇలా దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది పొలీసులు అధికారులతో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లతో అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మైపాల్ రెడ్డి ఇప్పటికే ఒక కేసులో రెండున్నరేళ్లు జైలు శిక్ష పడ్డా.. తెలంగాణ ప్రభుత్వం అండదండలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని నందీశ్వర్ గౌడ్ మోడీని కోరారు. ఈ అంశాన్ని ప్రధాని తప్పకుండా పరిశీలించి.. తగిన న్యాయం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: