Telangana: మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వం విజయం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Telangana: సుప్రీం కోర్టులో తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో ప్రభుత్వానికి..
Telangana: సుప్రీం కోర్టులో తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో గెలిచిన తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల విలువ చేసే భూములు దక్కాయి. 2016 నుండి సుప్రీంకోర్టులో ఈ జాగీర్ భూముల కేసు కొనసాగుతోంది. సుప్రీం కోర్టు తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు దక్కాయి. 1654 ఎకరాలు 32 గుంటలు తమవే నంటూ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ట్రిబ్యునల్ మద్దతుతో మణికొండ దర్గా కోర్టుకెక్కింది. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ భూముల వివాదం కొనసాగింది. గతంలో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, ఆ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం పక్కనపెట్టి మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానికేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ బెంచ్ తీర్పునిచ్చింది.
అయితే ధర్మాసనం156 పేజీల తీర్పును వెలువరించింది. దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా మారింది. అక్కడ కేవలం ఒక ఎకరం మాత్రమే దర్గాకు ఉందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఎట్టకేలకు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి: