NMDC Recruitment 2022: ఎమ్మెస్సీ/ఎంటెక్‌ అర్హతతో నెలకు రూ.1,30,000లు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) జూనియర్ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టుల (Junior Officer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NMDC Recruitment 2022: ఎమ్మెస్సీ/ఎంటెక్‌ అర్హతతో నెలకు రూ.1,30,000లు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి!
Nmdc
Follow us

|

Updated on: Feb 07, 2022 | 4:02 PM

NMDC Junior Officer Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) జూనియర్ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టుల (Junior Officer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 94

పోస్టులు: జూనియర్ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు

విభాగాలుః సివిల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మైనింగ్‌ జీ అండ్ క్యూసీ, సరే

పే స్కేల్: నెలకు రూ.37,000ల నుంచి రూ.1,30,000వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. 100 మల్లిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/ఇతర అభ్యర్ధులు: రూ.250
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు కలదు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CBSE Term 2 Exams 2022: టర్మ్ 2 పరీక్షలకు శాంపిల్ ప్రాక్టీస్ పేపర్లను విడుదల చేసిన సీబీఎస్సీ! ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..