CBSE Term 2 Exams 2022: టర్మ్ 2 పరీక్షలకు శాంపిల్ ప్రాక్టీస్ పేపర్లను విడుదల చేసిన సీబీఎస్సీ! ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
మార్చి-ఏప్రిల్ 2022లో జరగనున్న సీబీఎస్సీ టర్మ్ 2 పరీక్షలకు సంబందించి 11 అకడమిక్ శాంపిల్ ప్రాక్టీస్ (sample papers)పేపర్లను, సెల్ఫ్ ఎవల్యూషన్ చార్ట్స్ బోర్డు విడుదల చేసింది..
CBSE 10th, 12th Term 2 Exams 2022: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 తరగతులకు టర్మ్ 2 పరీక్షలు మార్చి-ఏప్రిల్ 2022లో జరగనున్నాయి. బోర్డు ఇంకా టైమ్‌టేబుల్‌ను విడుదల చేయలేదు. ఐతే బోర్డు అధికారిక సైట్ cbseacademic.nic.inలో 11 అకడమిక్ శాంపిల్ ప్రాక్టీస్ (sample papers)పేపర్లను విడుదల చేసింది. అంతేకాకుండా సెల్ఫ్ ఎవల్యూషన్ చార్ట్స్ కూడా విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి ప్రాక్టీస్ పేపర్లను, సెల్ఫ్ ఎవల్యూషన్ చార్ట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక సీబీఎస్సీ టర్మ్ 2కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించకుండా ఈ పరీక్షలు ఏ విధంగా జరుగుతాయనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక విద్యార్ధులు పరీక్షల్లో ఫుల్ మార్కులు సాధించాలంటే వ్యాల్యూ పాయింట్స్ రాయవల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం మధ్యలో ఆబ్జెక్టివ్ నుండి సబ్జెక్టివ్‌కు ఎగ్జాం ప్యాట్రన్ కూడా మార్చడం జరిగింది. వీటన్నింటి దృష్ట్యా టర్మ్ 2 పరీక్షలపై దేశ వ్యాప్తంగా చర్చకొనసాగుతోంది.
సీబీఎస్సీ టర్మ్ 2 ప్రాక్టీస్ పేపర్లను 2022 ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
- ముందుగా సీబీఎస్సీ అధికారిక సైట్cbseacademic.nic.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజీలో సీబీఎస్సీ టర్మ్ 2 నమూనా ప్రశ్నపత్రం లింక్‌పై క్లిక్ చేయండి.
- 10, 12 తరగతులకు సంబంధించిన నమూనా ప్రశ్నపత్రం లింక్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- మీరు ఏ పేపర్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.
- పేపర్ ఓపెన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి.
Also Read: