MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం

2021-22 లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కుదించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Mbbs
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2022 | 3:52 PM

2021-22 లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కుదించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి ఏడాది సహా అన్ని సంవత్సరాల వైద్యవిద్యను 11 నెలలే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు కేవలం 2021–22 బ్యాచ్‌ వారికే వర్తిస్తాయని ఎన్‌ఎంసీ వెల్లడించింది. తొలి సంవత్సరం సహా మిగిలిన సంవత్సరాల్లోనూ పండుగలు, వేసవి సెలవులు కలుపుకొని సుమారు 2 నెలలు సెలవు దినాలుంటాయి. అయితే ఈ సెలవు రోజులను ఒక నెలకు కుదించింది. దీంతో విద్యార్థులకు 11 నెలల పాటు విద్యా బోధన కొనసాగుతుంది. 2021–22 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఈ నెలలో తరగతులు ప్రారంభమై ఇదే ఏడాది డిసెంబర్‌లో ముగుస్తాయి. సాధారణంగా ఫస్టియర్‌ కోర్సు కాలవ్యవధి 13 నెలలు, ఇతర సంవత్సరాల్లో 12 నెలలు ఉంటుంది. ఇందులో మొదటి ఏడాది ఒక నెల ఫౌండేషన్‌ కోర్సు ఉంటుంది. తాజా మార్పులతో ఈ కోర్సును రోజువారీ తరగతుల్లో భాగంగా అదనపు సమయం కేటాయించి బోధించాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.

2023 జనవరిలో ఈ బ్యాచ్‌ తొలి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ అదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి 11 నెలలపాటు రెండో ఏడాది తరగతులుంటాయి. ఇలా కొనసాగే వారి వైద్యవిద్య 2026 జూన్‌లో తుది సంవత్సరం పరీక్షలతో ముగుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా ఆదేశాలిచ్చింది. తాజా ఉత్తర్వులతో ఈ నెల 14 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ వైద్య తరగతులు ప్రారంభించాల్సిందేనని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

Also Read

Andhra Pradesh: టంగుటూరు డబుల్‌ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ఎందుకు చంపారంటే..

IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..?

JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు..?

టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్