Andhra Pradesh: టంగుటూరు డబుల్‌ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ఎందుకు చంపారంటే..

Andhra Pradesh: ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లీ కూతుళ్ల హత్య కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు..

Andhra Pradesh: టంగుటూరు డబుల్‌ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ఎందుకు చంపారంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2022 | 3:42 PM

Andhra Pradesh: ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లీ కూతుళ్ల హత్య కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఒకరు శివకోటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ కిరాతకులు.. నగల కోసం అమాయకపు తల్లీబిడ్డలను హతమార్చినట్లు గుర్తించారు పోలీసులు. వివరాల్లోకెళితే.. రవికిషోర్‌, శ్రీదేవి దంపతులు వీరికి కూతురు మేఘన ఉంది. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో R.Kజ్యూయలర్స్‌ పేరుతో బంగారం షాపు నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ 3న రాత్రి ఎనిమిదన్నర టైమ్‌లో షాపు నుంచి ఇంటికి వచ్చారు. అంతే లోనికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్‌. తల్లీ కూతుళ్లిద్దరూ రక్తం మడుగులో నిర్జీవంగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. అయితే, రాత్రి 8 గంటల వరకు ఇరుగుపొరుగు వారితో ఎంతో సరదాగా గడిపారు తల్లీ కూతుళ్లు శ్రీదేవి, మేఘన. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరూ విగతజీవులుగా మారిపోయారు. తల్లీ బిడ్డలను దారుణంగా హతమార్చిన దుండగులు.. వారి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారు.

ఇది గమనించిన రవికిషోర్.. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారమందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఇంట్లో నగలు మాయమైనట్టు గుర్తించారు. అంటే నగల కోసం వచ్చిన దొంగలే ఈ ఇద్దర్నీ హత్య చేసినట్టు గుర్తించారు. క్లూస్ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌ల ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సిసి కెమెరా ఫుటేజ్‌ను పరిశీంచారు. అయితే, ఈ దారుణ హత్యలకు 3 నెలల ముందు.. బాధితుడు రవి సోదరుడు రంగాకు చెందిన బంగారం షాపులో దొంగలుపడ్డారు. దాదాపు 800 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసు చిక్కుముడి వీడక ముందే అదే కుటుంబంలో మరో దారుణం జరిగింది. ఆ చోరీ కేసుకు, ఈ జంట హత్యలకు ఏమైనా లింక్‌ ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. వీరిద్దరూ పాత నేరస్తులేనని తేల్చారు. వీరిలో శివ కోటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు.

Also read:

Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌.. వడ్డీ రేట్లు తగ్గింపు

PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ.. లైవ్ లో చూడండి

CBSE Term 2 Exams 2022: టర్మ్ 2 పరీక్షలకు శాంపిల్ ప్రాక్టీస్ పేపర్లను విడుదల చేసిన సీబీఎస్సీ! ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..