APSSDC Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెక్ మహీంద్రలో ఉద్యోగాల భర్తీకి రేపే జాబ్ మేళా..
APSSDC Jobs:ఏపీలో ఉన్న నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్‌మేళా ద్వారా టెక్ మహీంద్ర (Tech Mahindra)లో ఖాళీలను భర్తీ చేయనున్నారు...
APSSDC Jobs:ఏపీలో ఉన్న నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్‌మేళా ద్వారా టెక్ మహీంద్ర (Tech Mahindra)లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఇంటర్వ్యూకు ఎలా హాజరు కావాలి.? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో భాగంగా కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ – బ్యాంకింగ్ (150), కస్టమర్ సర్వీసెస్ ప్రాసెస్ – తమిళం (50) ఖాళీలు ఉన్నాయి .
* కస్టమర్ సర్వీస్ పోస్టులకు డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. హిందీ, లోకల్ లాగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎంపికై అభ్యర్థులకు ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి రూ.2.80 లక్షల వేతనం అందిస్తారు.
* కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. తమిళంతో పాటు లోకల్ భాష తెలిసి ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.80 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు ఫిబ్రవరి 6న (ఆదివారం) ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
* ఇంటర్వ్యూలను డాక్టర్. సీవీ రమన డిగ్రీ కాలేజ్, నాయుడుపేట, నెల్లూరూలో జరగనుంది.
* ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్/ చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివారలకోసం 9441522404, 8639835953 నంబర్లను సంప్రదించాలి.
Also Read: Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..
PM Modi: డిజిటల్ అగ్రికల్చర్‌తో భవిష్యత్తులో పెనుమార్పులు.. సేంద్రీయ సాగుపై దృష్టి పెట్టాలిః ప్రధాని