Subhash Goud |
Updated on: Feb 05, 2022 | 3:18 PM
Interest Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో బ్యాంకు ఖాతాలో డబ్బులున్న వారికి గతంలో కంటే ఇప్పుడు తక్కువ వడ్డీ వస్తుందనే చెప్పాలి.
రూ.10 లక్షలలోపు డబ్బులున్న సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటును 2.75 శాతానికి తగ్గించింది. అలాగే రూ.10 లక్షలకు పైగా డబ్బులున్న ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ ఖాతాలపై 2.8 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే రూ.500 కోట్లు లేదా ఆపైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన అకౌంట్లపై 3.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
ఇక దేశీ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, ఎన్‌ఆర్‌ఐ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త ఖాతాదారులు, పాత ఖాతాదారులు ఇద్దరికీ ఇదే వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.
ఈ బ్యాంకు డిసెంబర్‌లో సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను సైతం తగ్గించింది. అప్పుడు వడ్డీ రేటు 2.8 శాతానికి దిగి వచ్చింది. రూ. రూ.10 లక్షలలోపు డిపాజిట్లు కలిగిన ఖాతాలకు ఈ వడ్డీ రేటు ఉండగా, అదే రూ.10 లక్షలకు పైన డబ్బులున్న పొదుపు ఖాతాలకు వడ్డీ రేటు 2.85 శాతంగా ఉండేది.