- Telugu News Photo Gallery Business photos IndiGo Q3 Results: Firm posts profit of Rs 130 crore; revenue surges 89per cent YoY
IndiGo Profit: లాభాల్లో దూసుకెళ్లిన ఇండిగో.. భారీగా పెరిగిన ఆదాయం..!
IndiGo Profit: కరోనాతో అన్ని రంగాలు నష్టపోయాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడు..
Updated on: Feb 06, 2022 | 10:55 AM

IndiGo Profit: కరోనాతో అన్ని రంగాలు నష్టపోయాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాయి. ఇక విమానయాన రంగంలో కూడా నష్టాలు సంభవించాయి. అవి కూడా ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాయి.

దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి ఇండిగో లాభాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం భారీగా పెరగడంతో గత త్రైమాసికానికి గాను రూ.129.80 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. కోవిడ్‌తో పరిస్థితులుఎదురైనప్పటికీ లాభాల్లోకి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సంవత్సరం కిందట ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.620.10 కోట్ల నష్టం చవి చూడాల్సి వచ్చింది.

మరోవైపు కంపెనీ కో-ఫౌండర్ రాహుల్ భాటియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల్లో ఉన్న విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటోందని సంస్థ తెలిపింది.

గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,294.80 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,910 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఆదాయంలో విమాన ప్రయాణికుల టిక్కెట్లతో రూ.8,073 కోట్లు లభించాయి.




