Wedding card : ఆధార్ కార్డ్ కాదండి బాబూ!.. అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకోవడం పక్కా
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మరపురాని అనుభూతి. అందుకే వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతు వెరైటీగా ఉండాలనుకుంటారు. తమ పెళ్లి గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకుంటారు....
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మరపురాని అనుభూతి. అందుకే వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతు వెరైటీగా ఉండాలనుకుంటారు. తమ పెళ్లి గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకుంటారు. ఇంతటి విశిష్టమైన పెళ్లి వేడుకకు ఆహ్వాన పత్రిక డిఫరెంట్ గా ఉండాలనుకున్నారు ఛత్తీస్ గఢ్ లోని యశ్ పూర్ జిల్లా, ఫర్ సభ సమితి అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్. కరోనా నియంత్రణలో భాగంగా సామూహిక కార్యక్రమాలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అతితక్కువ మంది సమక్షంలో కల్యాణం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఆధార్ కార్డ్ రూపంలో శుభలేఖను రూపొందించాడు. ఇది చూసిన బంధువులు, స్నేహితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
పెళ్లికి వచ్చే వారందరూ మాస్క్ ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో వివరాలు నమోదు చేశాడు. బార్ కోడ్ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌లో ఆధార్ నంబరు స్థానంలో పెళ్లి తేది, అడ్రస్ స్థానంలో ఆచరించాల్సిన కరోనా నిబంధనలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read
LIC: ప్రపంచంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఎల్ఐసీ.. ఈక్విటీపై అధిక రాబడి ఇస్తున్న బీమా కంపెనీ..
Singer Revanth: పెళ్లిపీటలెక్కిన సింగర్ రేవంత్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పెళ్లి ఫొటోలు..
Andhra Pradesh: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి దుర్మరణం