AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Revanth: పెళ్లిపీటలెక్కిన సింగర్‌ రేవంత్.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన పెళ్లి ఫొటోలు..

ప్రముఖ సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడల్ విజేత రేవంత్( Singer Revanth)  ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెబుతూ అన్వితతో కలిసి ఏడడుగులు నడిచాడు.

Singer Revanth: పెళ్లిపీటలెక్కిన సింగర్‌ రేవంత్.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన పెళ్లి ఫొటోలు..
Revanth Wedding
Basha Shek
|

Updated on: Feb 07, 2022 | 11:40 AM

Share

ప్రముఖ సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడల్ విజేత రేవంత్( Singer Revanth)  ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెబుతూ అన్వితతో కలిసి ఏడడుగులు నడిచాడు. గుంటూరు (Guntur)లోని ఓ ప్రైవేట్‌ పంక్షన్‌ హాల్‌లో ఆదివారం (ఫిబ్రవరి6) వీరి వివాహం వేడుకగా జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు వీరి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా రేవంత్- అన్వితల పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు (wedding Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు రేవంత్‌ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. రేవంత్- అన్వితలు గతేడాది డిసెంబర్‌ 24న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

200కు పైగా పాటలు..

రేవంత్ పూర్తి పేరు.. లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఏపీలోని శ్రీకాకుళం అతని స్వస్థలం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. చదువుకునే సమయంలో సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. పలు మ్యూజిక్‌ కాంపిటీషన్స్‌, టీవీ రియాల్టి షోల్లో పాల్గొని సత్తా చాటాడు. ఈక్రమంలోనే ఇండియన్‌ ఐడల్‌-9 టైటిల్‌ గెల్చుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్లే బ్యాక్‌ సింగర్‌గా తెలుగుతో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను ఇప్పటివరకు దాదాపు 200కు పైగా పాటలు ఆలపించాడు. ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ తర్వాత ‘బాహుబలి’ సినిమాలోని ‘మనోహరి’ పాటతో మరసారి రేవంత్ పేరు మార్మోగిపోయింది. అదేవిధంగా బద్రీనాథ్ సినిమాలో ‘చిరంజీవ’, దమ్ములో ‘రూలర్‌’, అర్జున్‌ రెడ్డిలో ‘తెలిసెనే’ వంటి పాటలు అతనికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఇటీవల విడుదలై మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలోని ‘సానా కష్టం’ పాట కూడా ఈ రేవంతుడు ఆలపించిందే.

Also Read:Lata Mangeshkar: లతా మంగేష్కర్ తొలిసారిగా ప్రధాని మోడీ తల్లికి గుజరాతీ భాషలో లేఖ.. ఏమని రాసారో తెలుసా?

Amla Powder: మొటిమలు, నల్లమచ్చలకు ఉసిరి పొడి దివ్య ఔషధం.. ఎలా వాడాలంటే..?

RAGGING: ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు.. మద్యం తీసుకురావాలంటూ బలవంతం